అసత్యమాడు బ్రహ్మ పుర్రె అంతగా నచ్చిందా
ఆభరణముగా చేసి అలంకరించుకున్నావు
హింసకు గురిచూసే ఆ బోయకన్నునచ్చిందా
రక్తాశ్రువులను రాల్చ అనురక్తినిచూపావు
అమ్మ దగ్గర ఉండనన్న అర్భకునివాక్కు నచ్చిందా
అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు
స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా
ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు
పృష్ట భాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా
లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు
పెంపును అందించుతావో పంపు అని చంపుతావో
పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా
No comments:
Post a Comment