Saturday, May 30, 2020

OM NAMA SIVAAYA-11


పాట పాడుచు నిన్నుచేర పాటుపడుచు ఒక భక్తుడు
నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒక భక్తుడు
నాట్యమాడుచు నిన్ను చేర ఆరాటపడే ఒక భక్తుడు
కవిత వ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు
తపమాచరించుచు నిన్ను చేర తపియించుచు ఒక భక్తుడు
ప్రవచనముల నిన్ను చేర పరుగుతీయు ఒక భక్తుడు
చిత్రలేఖనముతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు
నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు
నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒక భక్తుడు
అర్చనలతో నిన్నుచేర ముచ్చటించు ఒక భక్తుడు
ఏ దారిలో నిన్ను చేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు,నువ్వు
నక్కతోక తొక్కావురా ఓ తిక్క శంకరా.
........................................................................................................................................... ..................................నక్కతోక తొక్కటం మీద అనేక కథలు ఉన్నప్పటికి వాటి సారాంశము ఒక్కటే.కష్టపడకుండా అదృష్టముతో చాకచక్యముగా ఐశ్వర్యవంతులుగా మారటం.శివుడు ఎవరిని అడగకుండా,ఏమి కష్టపడకుండా ఇన్ని విధములైన ఇంతమంది భక్తులను పొంది ఐశ్వర్యవంతుడైనాడని నింద.ఈశ్వరుడు అను పేరులోనే ఐశ్వర్యము కలవాడు అని మనకు తెలుస్తోంది.పరమేశ్వరుడు భక్తితో ఆడినా,పాడినా,నర్తించుచు కీర్తించినా,చిత్తరువులు చిత్రించినా,కవితలు చెప్పినా,ప్రవచనములు అందించినా,నిందించినా,నిలదీసినా,అర్చించినా ఏమిచేయాలో అని ఆలోచించు చున్నా,పఠించినా,వినినా-ఉద్దేశ్య పూర్వకముగానైనా,కాకతాళీయము(ఒక కాకి తాటిపండు పడే సమయానికి చెట్టుమీద వాలినది.తన సహాయము వలనే తాటిపండు కిందపడిందనుకుందట.) అటువంటి భావాలు కల భక్తులను కూడా ఏ మార్గములోనున్న భక్తులను శివుడు కరుణతో అనుగ్రహిస్తాడని స్తుతి.) 
   

  " పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః"  శివానంద లహరి.

  పురాణములు-మంత్రములు-స్తుతులు-నటనలు-చతురోక్తులు మొదలగునవేవి తెలియని వాడను.నేనెటువంటి వాడినో/దానొనో అంతా తెలిసిన పశుపతి నన్ను కృపతో పాలింపుము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...