ఓం నమ: శివాయ-17
**********************
కంటిచూపు ఉన్నది కాల్చుటకు అని నిన్ను చూసి కాబోలు
లంక చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఆ హనుమ
ఆలి ఉన్నది అగ్గిలో దూకించుటకే అని నిన్ను చూసి కాబోలు
అయోనిజను కోరె అగ్గి పరీక్ష ఆ రాముడు
అసత్యాల పుర్రెను ఆదరించిన నిన్ను చూసి కాబోలు
అవలీలగ పలికాడు అసత్యమును ఆ ధర్మరాజు
అడగకుండ వరమిచ్చే అలవాటుని నిన్ను చూసి కాబోలు
అంతటి వ్యధను పొందాడు ఆ దశరథ మహా రాజు
పొగడ్తలకు పొంగిపోవు నిన్ను చూసి కాబోలు
కౌరవులకు అపాత్ర ఆదరణను ఇచ్చె ఆ బలరాముడు
ఒక్కొక్కరు చేస్తున్న ఈ నికృష్టపు పనులన్నీ
నిక్కచ్చిగ నీవిరా ఓ తిక్క శంకరా.
శివుడు కంటితో మన్మధుని కాల్చినాడని అదిచూసి హనుమంతుని లంకా దహనము,శివ పత్ని సతిదక్ష యజ్ఞ వాటికలో అగ్గిలో దూకుట చూసి శ్రీ రాముని సీత అగ్ని పరీక్ష,పరబ్రహ్మ మూలమును చూసానని అబద్ధము చెప్పిన బ్రహ్మ తలను ధరించి గౌరవించుటచే ధర్మ రాజు అశ్వథ్థామ హత: కుంజర: అని అబద్ధము చెప్పుట,శివుడు వరములను సద్వినియోగ పరచుట తెలియని వారికి వరములు ఇచ్చి కష్టములు తెచ్చుకొనుట చూసి,దశరథుడు తాను అదేపని చేసి
దుఖ:పడినాడని,పొగడ్తలకు లొంగి అసురులను ఆశీర్వదించు శివుని చూసి బలరాముడు పొగడ్తలకు లొంగి కౌరవ పక్షపాతి అయినాడని నింద.
ఓం నమ: శివాయ-17
**********************
కంటిచూపు ఉన్నది కాల్చుటకు అని నిన్ను చూసి కాబోలు
లంక చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఆ హనుమ
ఆలి ఉన్నది అగ్గిలో దూకించుటకే అని నిన్ను చూసి కాబోలు
అయోనిజను కోరె అగ్గి పరీక్ష ఆ రాముడు
అసత్యాల పుర్రెను ఆదరించిన నిన్ను చూసి కాబోలు
అవలీలగ పలికాడు అసత్యమును ఆ ధర్మరాజు
అడగకుండ వరమిచ్చే అలవాటుని నిన్ను చూసి కాబోలు
అంతటి వ్యధను పొందాడు ఆ దశరథ మహా రాజు
పొగడ్తలకు పొంగిపోవు నిన్ను చూసి కాబోలు
కౌరవులకు అపాత్ర ఆదరణను ఇచ్చె ఆ బలరాముడు
ఒక్కొక్కరు చేస్తున్న ఈ నికృష్టపు పనులన్నీ
నిక్కచ్చిగ నీవిరా ఓ తిక్క శంకరా.
......శివుడు కంటితో మన్మధుని కాల్చినాడని అదిచూసి హనుమంతుని లంకా దహనము,శివ పత్ని సతి
దక్ష యజ్ఞ వాటికలో అగ్గిలో దూకుట చూసి శ్రీ రాముని సీత అగ్ని పరీక్ష,పరబ్రహ్మ మూలమును చూసానని అబద్ధము చెప్పిన బ్రహ్మ తలను ధరించి గౌరవించుతచే ధర్మ రాజు అశ్వథ్థామ హత: కుంజర: అని అబద్ధము చెప్పుట,శివుడు వరములను సద్వినియోగ పరచుట తెలియని వారికి వరములు ఇచ్చి కష్టములు తెచ్చుకొనుట చూసి,దశరథుడు తాను అదేపని చేసిదుఖ:పడినాడని,పొగడ్తలకు లొంగి అసురులను ఆశీర్వదించు శివుని చూసి బలరాముడు పొగడ్తలకు లొంగి కౌరవ పక్షపాతి అయినాడని నింద
" కామ దహన కరుణాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం"
కాముని దహించి కరుణచూపినవానికి నమస్కరించుచున్నాను.
బ్రహ్మ మానస పుత్రుడైన మన్మథుడు పుడుతూనే " కం దర్పయని?" అని బ్రహ్మగారిని ప్రశ్నించాడని శివ మహాపురాణ కథనము.ఎవరి మదమును నేనణచాలి అని తండ్రిని ప్రశ్నించినవాడు కనుక కందర్ప నామధేయుడైనాడు.బ్రహ్మగారు తారకాసురుని మదమును తెలియచేసి,వానిని సంహరింపగల కుమార జననమునకై శివపార్వతులను కళ్యాణోన్ముఖులని చేయవలెనని సెలవిచ్చినారట.లోక కళ్యాణమునకై,కానిపనియే అయినను కాదనలేకపోయాడు.గిరిజా కళ్యాణకారకుడైనాదు.ముక్కంటి మూడో కన్నుతాకిడికి భస్మమైనాడు.కాని కరుణాంతరంగుడైన కపర్ది దివ్యశరీరమును ప్రసాదించి,తన గణములలో స్థానము కల్పించి,కాల్చుట-కాచుట కొరకేనని మనకు తెలియచేసినాడు.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment