*******************
పాశము విడువనివాడు యమపాశము విడిపించగలదా
గంగను విడువనివాడు నా బెంగను తొలగించగలడా
మాయలేడిని విడువనివాడు మాయదాడిని ఎదిరించగలడా
పాములు విడువని వాడు పాపములను హరించగలడా
విషమును విడువనివాడు మిషలను కనిపెట్టగలడా
ఉబ్బును విడువని వాడు నా జబ్బును పోగొట్టగలడా
నృత్యము విడువని వాడు దుష్కృత్యములను ఆపగలడా
భిక్షాటన విడువని వాడు దుష్టుల శిక్షించగలదా
చిన్ముద్రలు విడువనివాడు ఆదుర్దా గమనించగలడా
వింతరాగమున్నవాడు వీతరాగుడవుతాడా
భోళాశంకరుడనుట వేళాకోలమునకేనా?అంటు
బుగ్గలు నొక్కుకుంటున్నారురా ఓ తిక్కశంకరా.
శివుడు చిన్ముద్రస్థితిలో ధ్యానముచేసుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికిని,తన పాశము-పాములు-వాటి విషము-గంగ-మాయ అనే లేడి-గంతులేయటం-బిచ్చమెత్తటం మొదలగు వాటిమీది అంతులేని ప్రేమతో వాటిని విడిచిపెట్టి ఉండలేక పోతున్నాడు.పైగా నేను విరాగిని-భోళాశంకరుడిని అని చెప్పుకుంటుంటాడు.-నింద.
వేదం నమః శివాయ--వేషం నమఃశివాయ
నృత్యం నమః శివాయ-కృత్యం నమః శివాయ.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
No comments:
Post a Comment