నీ సుతుడగు గణపయ్య అడ్డంకులు తొక్కాడు
నీవాహనమగు బసవయ్య పుష్టిని అందించాడు
నీకంఠాభరణము పొత్తముగా మారింది
నీ సగభాగపు గౌరమ్మ ఘంటము తానయింది
నీ సిగపూవగు గంగమ్మ గలగలా సాగింది
నీపరివారపు స్వచ్చంద సహకారములేగ
నీవే స్పురింపచేసిన నిందాస్తుతుల హేల
వికల్పములు పారద్రోలు శివ సంకల్పపు లీల
నా దిక్కైన శంకరుడు నాలోనే ఉన్నాదని
లెక్కలేని నా తిక్కను మక్కువతో నీకు ఇచ్చి
నీ అక్కరే లేనివైన ఈ చక్కెర పలుకులను
నేనెక్కడ వ్రాసానురా? దిక్కైన శంకరా!
No comments:
Post a Comment