కాసు లేనివాడవని కానిమాటలన్నాను
బేసి కన్నులను చూసి రోసిపోయి ఉన్నాను
దోసములే నీ పనులని ఈసడించుకున్నాను
వేసమేమిటో అంటుఈసడించుకున్నాను
నీ కొండను ఎత్తినాడు నీ విల్లు ఎత్తలేదు కద
సహకారమునుఈయనిది అతని అహంకారమేగ
దిక్కు నీవు అనగానే పక్కనేఉంటావు
అహంకారమును వదిలేస్తే అధీనుడివి అవుతావు
స్వల్పకాలిక లయముతో శక్తినీస్తావు
దీర్ఘకాలిక లయముతో ముక్తిని ఇస్తావు
నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
మొక్కనీయరా భక్తితో ముక్కంటి శంకరా!
" రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో
భీతః స్వస్థగృహం గృహస్థమతిధిః దీనః ప్రభుం ధార్మికం
దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతః సర్వ భయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం
శివానందలహరి.
ఓ మనసా! ఏ విధముగా నీటిలో కొట్టుకొనిపోవువాడు ఒడ్డును,అలిసిన బాటసారి చెట్టు నీడను,వర్షభయము కలవాడు ధృఢమైన ఇంటిని,అతిథి గృహస్థుని,దీనుడు ధార్మికుడైన ప్రభువును,చీకటిలో భయపడువాడు దీపమును,చలిలో వణుకువాడు మంటనుచేరునట్లుగా,సమస్త భయములను పోగొట్టి సుఖమునిచ్చు శివుని పాద పద్మములను ఆశ్రయింపుము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment