ఓం నమ: శివాయ
భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా
పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా
అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా
జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా
వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా
ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా
సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా
చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా
భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా
(ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా
దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా
సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా.
.............................. .............................. .............................. .............................. .............................. ...................మాలిన్యము లేనిది మాల.పరమాత్మ ప్రతిభను గుర్తించి చేయు కీర్తనలే స్తోత్రములు.ఉదాహరణ-శివ మహిమ నవరత్న మాలిక.విలువైన నవరత్నములు కంఠమున అలంకరింపబడి అతిశయించుట సాధారణ అర్థము భక్తుల కంఠములందు తిరుగుతు వాగ్రూపముగా వెలువడుట గూఢార్థము.నేల,నింగి,నీరు,నిప్పు ,గాలి,ఎండ,వెన్నెల,భక్తానుగ్రహ రూపములలో ప్రకాశించు శివునికి అనేక అనేక నమస్కారములు
( ఏక బిల్వం శివార్పణం )
భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా
పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా
అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా
జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా
వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా
ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా
సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా
చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా
భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా
(ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా
దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా
సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా.
తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! జనులు భూమిలో భక్తసులభుడవైన నిన్ను ఒక్క బిల్వపత్రముతో పూజించక ఇతర దేవతలకు నానావిధములైన ప్రసాదములు పెట్టి చెడి ఎందుకూ కొరగాకుండా పోవుచున్నారు కదా
..............................( ఏక బిల్వం శివార్పణం )
No comments:
Post a Comment