ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
భక్తి మకరందమును చందనముగ పూయనా
ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా
శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా
పాప రహితము అనే దీపము వెలిగించనా
పొగడపూల వాసనలనే పొగలుగ నే వేయనా
లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే చేయనా
ఉచ్చ్వాశ-నిశ్వాస వింజామరలను వీచనా
అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా
దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా
నా పక్కనే ఉన్నావురా చూద చక్కనైన శంకరా!
తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ముందు నేను ఎత్తిన జన్మలెన్నో, వాటిలో నేను చేసిన కర్మలెన్నో నాకు తెలియదు.ఎంత ఆలోచించినా నేను తెలుసుకోనలేకున్నను. ఈ జన్మమే పారమార్థికమని భావించుచున్న నాకు ఈ జన్మలో చేసిన నీ ధ్యానపుణ్యముచేత ఇదియే కడగొట్టు జన్మ గావింపుము ప్రభో
No comments:
Post a Comment