Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-15

ఓం నమః శివాయ-15 ***************** తిరిపమెత్తువాడవని నిరుపేద శ్రీనాథుడు గలగల ప్రవహించనీయని గడుసువాడవని గంగ చరచర పాకనీయవని చతురుడవని కాళము పరుగులుతీయనీయవని పాశమున్నదని లేడి క్రిందకు జారనీయవని నిందిస్తున్నది విషము జరుగలేక ఉన్నానని వంతపాడు జాబిలి కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలములు హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము ఆ లయకారుడు ఆలయమున ఉంటాడా? అంటూ మేమెంతో గొప్పవారలమని వంతులవారీగ నీ చెంతనే ఉంటూ,కాని చింతలను చేస్తుంటే,వాటి పక్కదారి మార్చవేర ఓ తిక్క శంకరా. శివుడు బిచ్చగాడు.గంగను ప్రవహించనీయడు.(స్వేచ్చగా)పాములను పాకనీయడు.లేడిని పరుగెత్తనీయడు.చంద్రుని కదలనీయడు.విషమును కంఠము జారనీయడు.ఎద్దును రంకెలు వేయనీయడు.పక్కనే ఉండి తనను నిందిస్తున్నా వాటినేమిచేయలేడు-నింద. రుద్ర చమకములో చెప్పినట్లు "యంతాయచ-ధర్తాయచ" ఎక్కడ-ఏవస్తువులు ఎలా ఉండాలో వాటి స్థానమును-స్వభావమును నియంత్రించి-పోషించగల ఆచార్యుడు శివుడు.-స్తుతి. ఏకబిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...