Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-24

ఓం నమ: శివాయ-24 ****************** నేను అభిషేకము చేస్తుంటే అభినివేశము ఏది? అంటావు నేను దీపారాధనము చేస్తుంటే భక్తి ఉద్దీపనము ఏది? అంటావు నేను చందనము అలదుతుంటే అలదే చందమా? అంటావు నేను పూలహారములు వేస్తుంటే పాపపరిహారములా! అంటావు నేను మహన్యాసము చదువుతుంటే చాల్లే! అపహాస్యము అంటావు నేను ఆరగింపు చేస్తుంటే పండ్లను ఏరలేదా? అంటావు నేను హారతులను ఇస్తుంటే సేవానిరతి ఏది? అంటావు నేను మంత్రపుష్పము అందిస్తే, సంపెంగ పుష్పము అంటావు నేను సకల ఉపచారములు చేస్తుంటే త్రికరణ ఏది? అంటావు నేను శక్తి కొలది పూజచేస్తే అనురక్తి లేదు అంటావు నువ్వు సంతుష్టి చెంది,పరిపుష్టిని అనుగ్రహించేందుకు భక్తి అనే రొక్కమెంత కావాలిరా ఓ తిక్క శంకరా. ..................................................................................................................................................................................................... కార్తీక సోమవార పూజా విధానములో ఒక భక్తుని శివుడు తనకు దీపమును ఆసక్తితో వెలిగించలేదని గంధమును ఆరాధనతో అలంకరించలేదని,పాపములను శివుడు పోగొడతాడనే వ్యాపార ధోరణిలో పూల హారములను సమర్పించాడని,మంచి ఫలములను ఏరి సమర్పించలేదని త్రికరణ శుద్ధిగా మహన్యాసమును చదవలేదని,మకరందము లేని సంపెంగ పుష్పమును మంత్ర పుష్పముగా సమర్పించినాడని ఆక్షేపించి ఉపచారములను శివుడు స్వీకరించలేదు.నింద నియమం నమః శివాయ-నిఖిలం నమః శివాయ భక్తుడు నమః శివాయ-భర్గుడు నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నీలకంఠుని శిరముపై నీళ్ళుచల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసర మొల్ల సురశాఖి వాడింటి మల్లెచెట్టు. రాజశేఖరచరిత్ర. నెలరాజును శిఖయందుంచుకొనిన శివుని తలపై ఎవ్వడైన కాసిని నీళ్ళు చల్లి.కొంచము పత్రిని విసిరి వేసిననను పరమ దయాళువైన శివుడు కామధేనువును వాడి ఇంటికి గాడికి కడ్తాడు.కల్పవృక్షమును వారి తోటకు కదిలిస్తాడు.- సంవిధ అను అంధురాలు ఆకలితాళలేక అన్నమునకై,అటువైపువెళుతున్న ఒక శివభక్తుని కాళ్ళు పట్టుకొనగా,అతని చేతిలోని జలపాత్ర జారి క్జలము సివలింగముపై పడినది.రాలిపడిన మారేడు ఆకును వాసన చూసి ఆహారముకాదని విసిరివేయగానే అది ఆ శివలింగముపై పడినదట.అంతే సర్వపాప క్షయకరం.తల్లి శివానుగ్రహమును పొందినది.-శివ మహా పురాణం. అల్ప సంతోషి యైన అశుతోషుడు అందరిని అవ్యాజ కరుణతో అనుగ్రహిస్తాడు.స్తుతి. . . . ( ఏక బిల్వం శివార్పణం).

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...