Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-21

ఓం నమ: శివాయ-21 ఉదారతను చాటగ " అసురుని ఉదరములో నుంటివి" " గంగిరెద్దు మేళము" నిన్ను కాపాడినది ఆనాడు. వరముగ కోరాడని " అసురుని హస్తమున అగ్గినిస్తివి" " మోహిని అవతారము" నిన్ను కాపాడినది ఆనాడు. భోళాతనమును చాటగ " అసురునికి ఆలినిస్తివి" " నారద వాక్యము" నిన్ను కాపాడినది ఆనాడు. ఆత్మీయత అను పేర " ఆ అసురునికే ఆత్మలింగమునిస్తివి" " గణపతి చతురత" నిన్ను కాపాడినది ఆనాడు భ్రష్టులైనవారిని "నీ భక్తులు" అని అంటావు రుసరుసలాడగలేవు "కసురుకొనవు అసురతను" మ్రొక్కారని అసురులకు " గ్రక్కున వరములు ఇస్తే" " పిక్క బలము చూపాలిరా" ఓ తిక్క శంకరా. భావము శివుడు వరముగా గజాసురుని ఉదరములో నుండెను.తలపై చేయి పెట్టిన వారు భస్మము అగుదురని రాక్షసునుకి వరమిచ్చెను.రావణునికి అర్థాగిని మరియు ఆత్మ లింగమును వరముగా ఇచ్చెను.ఆలోచించకుండా శివుడు అసురులకు వరములిచ్చి ఆపదలలో చిక్కుకునిపరుగులు తీస్తుంటాడు-నింద. బ్రహ్మాది దేవతలకు తమ భక్తిని చాటుకునే అవకాశం ఇచ్చాడు శివుడు.నారదుని,గణపతిని లోక కళ్యాణ కారులుగా,భక్తులకు" గోకర్ణేశ్వర క్షేత్రమును" అనుగ్రహించాడు.విష్ణువు యొక్క కరుణ అనే జగన్మోహనత్వమును ప్రకటింప చేసిన "పరమ శివుడు" దయా సముద్రుడు.-స్తుతి. బీరం నమః శివాయ-వీరం నమః శివాయ రౌద్రం నమః శివాయ-ఆర్ద్రం నమః శివాయ నమః శివాయ -నమః శివాయ ఓం నమః శివాయ. ( ఏక బిల్వం శివార్పణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...