Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-45

ఓం నమః శివాయ-45 ******************** పొగడ్తలకు లొంగిపోతే ఉబ్బులింగడు అంటున్నారు చిరాకుని చూపిస్తే చిందేస్తున్నాడంటున్నారు కోపముతో ఊగుతుంటే వీరభద్రుడంటున్నారు చిట్టిచీమ కుట్టగానే శివుని ఆన అంటున్నారు శుచిలేనిది చూస్తుంటే శివ-శివ అంటున్నారు కలిసిరాక దిగులుంటే గంగపాలు అంటున్నారు బిచ్చగాడివి నీవని ముచ్చటించుకుంటున్నారు అమాయకతతో నుంటే అది నీ మాయ అంటున్నారు దిక్కుమాలిన పోలికలతో నిన్ను తొక్కేస్తున్నారు తీరులేనివాడివంటు నిన్ను తీర్మానిస్తున్నారు మంచుకొండ దేవుడిలో మంచితనము లేదంటు వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా. తన అవలక్షణములను సందర్భానుసారముగా సమన్వయించుకునే చనువును శివుడు ఇచ్చాడు కనుకనే వారు ఉబ్బులింగడు-చిందేస్తాడు-వీరభద్రుడు-చీమలను కుట్టమంటాడు-గంగపాలు-బిచ్చగాడు అంటూ శిబునితో పోల్చుకుంటూ,అపహాస్యము చేస్తున్న వారిని ఏమీ అనలేక ఊరుకుంటాడు-పిరికివాడు శివుడు కనుక సర్దుకుని పోతాడు.-నింద. లోకము నమః శివాయ-లోకులు నమః శివాయ పోలిక నమః శివాయ-ఏలిక నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయిసదయ భావం పశుపతిం చిదలంబం సాంబం "శివమతివిడంబం" హృదిభజే." శివానందలహరి. శివుడు అత్యంత మనోహరుడు.నాగభూషణాలంకృతుడు.అవియును కదులుచున్న సర్పములను ధరించువాడు.కాలమనే లేడిని ఒడిసి పట్టుకున్నవాడు.త్రిపురాసురులను సంహరించినవాడు.మహా వీరుడు.చిత్ప్రకాశకుడు.అన్నింటికిని మించి,ఎవ్వరు-ఎన్నటికి-ఎక్కడైనను అనుకరించుటకు సాధ్యము కానివాడు.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...