Saturday, September 12, 2020

SIVASANKALPAMU-09

ఓం నమ: శివాయ-09 భక్త పరాధీనతతో బడలిపోయి ఉన్నావని నక్తపు నియమాలతో నకనకలాడుతున్నావని భక్ష్యభోజ్య చోహ్యములు,లక్షణమగు లేహ్యములు చవులూరు చెరకు రసము,ఆహా అను అతిరసములు నారికేళ జలాలు,నానా తినుబండారాలు మధురస మామిడిపళ్ళూ,మంచి నేరేడు పళ్ళు చక్కెరకేళి పళ్ళు,చక్కనైన ద్రాక్షపళ్ళు ఆరు రుచుల ఆథరువులు ఆత్మీయ సమర్పణలు పోషణలేక నీవు సోషతో సొక్కిపోతావని మక్కువతో తినిపించగ గ్రక్కున నేను వస్తే విషము రుచి నీకంత విపరీతముగా నచ్చిందా ఒక్కటైన ముట్టవేర ఓ తిక్క శంకరా. భావము ఒక్కపూట ఆహారముతో (నక్తము) శివుడు నీరసముగా,చిక్కిపోయి ఉన్నాడని,అనేక మథుర పదార్థాలను సమర్పించుదామని,తినిపించుదామని భక్తుడు వస్తే,శివుడు వాటిని స్వీకరించుటలేదు-నింద. పరమేశ్వరుడు సర్వజనుల మేలుకొరకు మథురస పదార్థములకన్న విషము స్వీకరిచడానికి సంసిద్ధుడైనాడని స్తుతి. ( ఏక బిల్వం శివార్పణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...