Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-25

ఓం నమ: శివాయ-25 ********************* శ్రీకరుడౌ శివునికి కరివదనుని ప్రస్తుతి షదక్షరీ మంత్రధారికి షణ్ముఖుని ప్రస్తుతి ఆనంద తాండవునికి ఆ నందిముఖుని ప్రస్తుతి హరోం హర దేవునికి హయ వదనుని ప్రస్తుతి శుభకర శంకరునికి శుకవదనుని ప్రస్తుతి శితికంఠ వదనునికి సిమ్హవదనుని ప్రస్తుతి కపర్ది నామధారికి కపివదనుని ప్రస్తుతి మేనక అల్లునికి మేషవదనుని ప్రస్తుతి ఆపదోద్ధారకునికి ఆ పతంజలి ప్రస్తుతి బ్రహ్మాండ నాయకునికి బహు ముఖముల ప్రస్తుతి నాపై కరుణచూప నీవు సుముఖముగా లేకుండుట,నీ టక్కరితనమేరా ఓ తిక్క శంకరా ..వినాయకుని ఏనుగుతల,తుంబురుని గుర్రముతల,శుక మహర్షి చిలుకతలనరసిమ్హస్వామి సిమ్హపుతల,నారదుని కోతి తల,దక్షుని మేకతల,పతంజలి మనిషితల..పాము శరీరము,కుమారస్వామికి ఆరుతలలు.వీరిలో ఎవరు పరిపూర్ణ మానవరూపముతో లేరు.తలవేరు-శరీరము వేరు.అయినా శివుడు వారి పూజలను స్వీకరిస్తు పూర్తి మానవరూపములో నున్న నాపూజను స్వీకరించుటకు ఇష్టపడకపోవటము నింద స్మరణం నమః శివాయ-శరణం నమః శివాయ అభయం నమః శివాయ-అఖిలం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. "నమో రుద్రాయ ..త తావినే క్షేత్రాణాం పతయే నమ:" రుద్రనమకం. క్షేత్రములనగా శరీరములు.శరీరములతో జీవుని రూపమున నివసించు దేవుని రూపమును రక్షించువాడు పరమశివుడు. ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణోఽధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ . మంత్రపుష్పము. బ్రహ్మం అనగా ఉన్నది అను అర్థమును పెద్దలు చెబుతారు.అనేక నామ రూపములతో-స్వభావములతో నున్న సకల జీవులు శివస్వరూపములే అని,వారిని శక్తి వంతము చేయుచున్నది ఈశ్వరచైతన్యమేనని మంత్రపుష్పము వివరించుచున్నది.పశుపతికి పశుముఖముల స్తుతి అభ్యంతకరము కానేకాదు. .భక్తి ప్రధానముగాని భక్తుల రూపము శివునికి ప్రధానము కాదు.స్తుతి ఏక బిల్వం శివార్పణం తక్కువ చూపు

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...