Saturday, September 12, 2020

SIVA SANKALPAMU-48

ఓం నమ శివాయ-48 ******************** నారి ఊదదీయమనగానే జారిపోవచేసావు అమ్ములు దాచేయమనిన గమ్మున దాచేసావు విల్లుకనబడకూడనిన వల్లె యని అన్నావు పినాకమే కానరాని పినాకపాణివి నీవు మంచపుకోడును కూడ కనిపించకుండ చేసావు ఖట్వాంగధారివైన ఖండోబా దేవుడవు పరశును మొద్దుచేయమంటే పదును తీసేసావు ఖండపరశు కానరాని పరమేశుడివి నీవు లేశమైన లేకుండా ఆశాపాశమును తీస్తావు పాశుపతాస్రములేని పశుపతివి నీవు రుద్రములో చెప్పారని వద్దనక చేస్తుంటే తెలితక్కువంటారురా ఓ తిక్క శంకరా. విల్లువద్దు బాణమువద్దు గొడ్డలి వద్దు మంచపుకోడు ఆయుధము వద్దు.నీ ఆయుధములను నిస్తేజముచేసి పక్కన పెట్టు అనగానే రుద్రములో శివుడు మారుమాటాడకుండా చేస్తాడు.నేనెందులకు చేయాలని ప్రశ్నించలేని పిరికివాడు శివుడు-నింద. విల్లు నమః శివాయ-రెల్లు నమః శివాయ పరశు నమః శివాయ-పరము నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. " ఆకర్నకృష్టే ధనుషి జవలంతీం దేవీం మిషు భాస్వతి సంధధానం ధాయత్ మహేశం మహనీయవేషం దేవ్యాయుతం యోధతనుం యువానాం." ఆకర్ణాంతము లాగబడి ప్రకాశించు ధనువునందు ,మహాప్రభావముకల జ్వలించుచున్న బాణమును సంఢించ్చున్నవాడును,వీరుని రూపము కలవాడును,ఉత్తమమైన అలంకారము కలవాడును దేవితో కూడిన వాడైన మహేశ్వరుడు(దుష్టశిక్షణకై) మమ్ములను రక్షించుటకు వానిని దూరముగా ఉంచి,ప్రసన్నుడై అనుగ్రహించుగాక. " నమస్తే రుద్రమన్యవ ఉతో త ఇషువ నమః నమస్తే అస్తు ధన్వనే బాహూభ్యాముతతే నమః". రుద్రమంత్రములు ప్రత్యక్ష కృతములు.స్వామిని స్వయముగా సంబోధించి,ప్రస్తుతించునవి.స్వామీ నీ ఘోర రూపమును ఉపసంహరించుకొని,శాంతుడవై అఘోర రూపివై అఖిలపాలనను కొనసాగింపుము. స్వామి ఆయుధములను పక్కకు పెట్టుట అంటే అఖిలజగములలో ధర్మము నాలుగు పాదములలో నుండుట-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...