సౌందర్య లహరి-07
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
నేను కసురుకున్నా గాని ముసిముసి నవ్వే అనుకో
నేను విసిగించిన గాని నాది పసితనమే అనుకో
నేను చేయి పట్టుకోనన్నా నన్ను గట్టిగా పట్టుకో
నేను మారాములు చేసినా గారాబు పట్టిని అనుకో
వట్టిమాటలే అయినా కట్టుకఠలు కావనుకో
గాజుకళ్ళతో నిన్ను చూసినా రాజీ పడిపో
నీ ఆలన-పాలనలో నేను తేలి ఆదాలనుకో
తెలిసో-తెలియకో నిన్ను నేను వేడుకొనుచున్నవేళ
నీ మ్రోలనే ఉన్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment