నీలి మేఘమే నీవనుకుని నేను చాతకమై చూశారా
నీలి గరళము నన్నుచూసి గేలిచేసిందిరా
సూర్యాయ దక్షాధ్వర అనివిని నేను చక్రవాకమై కదిలానురా
మంచుకొండ నన్నుచూసి గేలిచేసిందిరా
చంద్ర శేఖరుడివని నేను చకోరమై కదిలారా
దీప,ధూపముల వేడి నన్ను గేలిచేసిందిరా
నటరాజువి నీవని నేను నెమలిగా చేరానురా
భృంగి కన్ను నన్నుచూసి గేలిచేసిందిరా
శుభకరుడివి నీవని నేను గరుడినిగా వాలారా
కంచి గరుడ సేవకు సమయము మించిందన్నారురా
భ్రమలను తొలగించలేని భ్రమరాంబికాపతి
ఇక్కట్లేనురా చూడర ఓ తిక్క శంకరా.
No comments:
Post a Comment