Thursday, June 29, 2017

సౌందర్య లహరి-o8


   సౌందర్యలహరి-08

  పరమ పావనమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  కనిపించు భూమి నీ పంపును పాటించదని
  ఉప్పొంగు కడలి నీ చెప్పుచేత  లేదని

  రగులుచున్న దావాగ్ని  నీ మాట దాటివేయునని
  కదులుచున్న గగనము నీమాట వినుట గగనమని

  వీచుచున్న పవనము నీ మాటను జవదాటునని
  పొంచియుండి జగములను ప్రళయములో ముంచునని

  పంచభూత తత్త్వము మంచిని పంచలేదను
  నా కోపావేశము నీ సన్నిధికి సోపానమగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...