సౌందర్య లహరి-09
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సృష్టి పూర్వపు స్థితి ధూమము అను చీకటి
తొలగించును ముకుళిత-సంకోచిత ఈక్షణశక్తి
అమ్మ కనుల వికసనము సృష్టి స్పష్టపు స్థితి
కన్నుల అవలోకనము స్థితికారక ఉద్ధతి
ముకుళిత నయనముల పని ముంచేసే ప్రళయము
క+అ+మ పరబ్రహ్మ వాచకము "కామాక్షి"
అనంత దర్శనశక్తిగల ఆదిశక్తి శతాక్షి
జగతి సమ్రక్షణ-పోషణ మీనాక్షిగ మారువేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment