శివ సంకల్పము-71
చీమలు పెట్టిన పుట్టలను నీ పాములు దోచేస్తున్నాయిరా
తేనెను చేర్చిన పట్టును నీ భృంగి దోచేస్తున్నాడురా
కోతకు వచ్చిన పంటను నీ శిగగంగ ఎత్తుకెళ్తోందిరా
వాటితో పోటీగా నీ చేతివాటము చూపిస్తున్నావురా
వేటిని వదలకుండ దాటించేస్తున్నావురా
ప్రళయమనే పేరుతో ప్రపంచాన్నే దోచేస్తున్నావురా
ఓం నమఃచోరాయచ అని అన్నదే తడవుగా
ఓనమాల ఆనవాలు ఓంకారము దోచేస్తున్నదిరా
నేరమేమి కాదంటున్న దొంగతనపు దొరవు నీవు
రాబడి సరిపోయిందని నీ దోపిడిని ఆపకుంటే
సకల జనులు సతమవుతున్నారు, సంపదలను
దక్కనీయమోనని ఓ తిక్క శంకరా.
No comments:
Post a Comment