శివార్పణం
ఈశ నిన్ను గాననైతిని ఈసు మనమున నిండగా
పాశములు తొలగించు నా మది కాశివాసము చేయగా
నే చీమనైనా కాకపోతిని శివుని ఆనతి చాటగా
పామునైన కాకపోతిని సామి గళమును చేరగా
సాలెనైన కాకపోతిని శూలి గూటిని నేయగా
కరినియైనా కాకపోతిని కనికరమునే పొందగా
లేడినైనా కాకపోతిని వేడుకగ దరిచేరగా
పులితోలునైన కాకపోతిని నూలుపోగుగ మారగా
పందినైన కాకపోతిని బొందినే అందీయగా
ఎద్దునైన కాకపోతిని పెద్దదేవుని మోయగా
బూదినైనా కాకపోతిని ఆదిదేవుని తాకగా
జటనుయైన కాకపోతిని జటిలమును తొలగించగా
విషమునైన కాకపోతిని విషయమును గ్రహియించగా
పుర్రెనైనా కాకపోతిని వెర్రితనమును బాపగా
వాని యోగమేమో కాని ఉపయోగములుగా మారగా
నన్ను తరియించనీ నీ అనవరతపు కరుణగ
No comments:
Post a Comment