అంబరమే తన్నీరే శోఱే అఱుం శెయ్యుం
ఎంబెరుమాన్ నంద గోపాలా! ఎళుందిరాయ్
కొంబనార్క్కెల్లాం కొళుందే! కులవిళక్కే
ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్
అంబరం ఊడ~అరుత్తు ఓంగిఉళగళంద
ఉంబర్ కోమానే! ఉఱంగాదు ఎళుందిరాయ్
శెంబుఱ్ కరలడి శెల్వా బలదేవా
ఉంబియుం నీయుం ఉఱంగ్ ఏలో రెంబాయ్.
ఓం నమో నారాయణాయ-17
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది
మోదపు ప్రదానముతో " దానపు నిధానమైన"
ఆనంద గోపాలుని తండ్రి " ఆ నంద మహారాజులో"
" నదీతీరముల మొలుచు" అతిసుకుమారములైన
" ప్రబ్బలి" చిగురుబోడి గొబ్బెత" యశోదమ్మలో"
" ఆదిశేషుడే" స్వయముగ స్వామికి" అన్నగారైన"
హలాయుధుడు " బలరాముని కాలి కడియములో"
స్థూల-సూక్ష్మములన్నింట్లో " మూలము" తానేయైన
పంకేరుహలోచనుని " శంఖు-చక్ర పాదములలో"
అతి" పవిత్రమైన వ్రతము" ఆచరింప రారె
" ఆముక్తమాల్యద" ఆండాళ్ " అమ్మ వెంట" నేడె.
భావము
గోపికలు యశోదను-నంద ప్రభువును,బలరామ కృష్ణులను కీర్తించుచు,వారిని మేల్కొలుపుచున్నారు.ఇది సామాన్యార్థము.మన గోపిక అమ్మ అనుగ్రహముతో దాన యశో విరాజితుడగు నంద ప్రభువును,పవిత్ర నదీ తీరములందు మొలచు ప్రబ్బలి చెట్తు యొక్క సౌకుమార్యతను గలిగిన యశోదను( యశమునిచ్చు తల్లిని)బలరాముని కాలి కడియమును,శంఖ-చక్రములున్న స్వామి పాద పద్మములను భావించగలుగుతున్నది.(సామాన్యార్థము.)
గోకులము వైకుంఠము.బ్రహ్మానందము నందుడు.ముక్తి కాంత యశోద.గోపికలు ఉపనిషత్మంత్రములు.బలరామ-కృష్ణులు వేదము-అర్థములు.
దాన యశోవిరాజితుడగు నంద మహారాజుని,ప్రబ్బలి సౌకుమార్యముగల యశోదమ్మను,బలరాముని కాలి కడియమును,శంఖు-చక్రములున్న స్వామి పాద పద్మములను,అమ్మ వెంటనున్న మన గోపిక భావించగలుగుతున్నది.(ఇది సామాన్యార్థము)
స్వామి పాదములోని శంఖము సకల జీవుల నాద రూపమునకు ( ఓంకారము),చక్రము సకలజీవుల తేజో రూపములకు సంకేతములు.మన గోపిక,ఆండాళ్ తల్లిలో యశోద సౌకుమార్యమును,నందుని సౌశీల్యమును దర్శించ గలుగుతున్నది.(శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అంశ నలుపు-తెలుపు రంగులలో ఏర్పడి తెలుపు అంశ దేవకీ గర్భమునుండి రేవతీ గర్భమునకు తరలించబడినదని భాగవతోత్తములు చెబుతుంటారు).స్వామికి అన్నయైన రాముడు అతి బలపరాక్రమవంతుడగుటచే బలరాముడని,బలవంతుడని నామసార్థక్యతము పొందినాడు.రెండు గర్భములలో ఎదిగిన వాడగుటచే సంకర్షణుడు అని కీర్తింపబడుచున్నాడు.హలము (నాగలి)ఆయుధముగా కలవాడు కనుక బలరాముని హలాయుధుడు అని కూడా వ్యవహరిస్తారు." రామో రామశ్చ రామశ్చ" త్రయములో ఒకడు.
శ్రీ కృష్ణుడు పాడికి,బలరాముడు పంటలకు (స్థితి కార్యములకు) నిర్వాహకులు.సమర్థ స్థితి కార్య నిర్వహణకు యాదవులు సమర్పించిన గౌరవ సూచనలే కాలి కడియములు.ప్రబంధ యుగములోని గండపెండేరమునకు మూలముగా తోచుచున్నవి.మన గోపిక స్థితికారుని ద్వైత (రెండు) రూపాలలోని ఒక్క (అద్వైత) రూపమును అనుభవించుటకు అమ్మవెంట నడుచుచున్నదన్న తలపులో నిమగ్నమైన నా మనసు పాశురములను కీర్తించుచు అమ్మతో వ్రతము చేయుటకు సాగుచున్న గోపికలతో కలిసి,ముందుకు అడుగులు వేస్తున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )
No comments:
Post a Comment