ఉందు మద కళిత్తన్ ఓడాద తోళ్వళియన్
నంద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్
కందం కమరుంకురలికడై తిఋఅవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాధవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిలినంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్మైత్తునన్ పేర్ పాడ
శెందామరై క్కెయాల్ శీరార్ వళై ఒళిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్ ఏలో రెంబా వాయ్.
ఓం నమో నారాయణాయ-18
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణిచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది.
"భక్తాంఘ్రిరేణుం- భగవంతుమీడే" అని కీర్తించుచున్నవైన
తొండరడిప్పొడి ఆళ్వార్ విరచిత " తిరుప్పళ్ళి యళుచ్చి"లో
ముదితలార! ముచ్చటగ "మదమును స్రవించుచున్నవైన"
మాతంగములను "మర్దించు " మదన గోపాలునిలో
పోటీ పడుచు చేరుచున్న " మళ్లలేని నోళ్ళవైన"
కోళ్ళ కొక్కొరోకో అను " కోటి కోటి పిలుపులలో"
"మాధవీలత"" పందిరిపై " గుంపులుగా కూర్చున్నవైన
గోపికమ్మలను నిద్రలేపు" కోకిలమ్మ గానములలో"
అతి" పవిత్రమైన వ్రతము " ఆచరింప రారె
" ఆముక్తమాల్యద ఆండాళ్" అమ్మ వెంట నేడె.
భావము
తిరుప్పళ్ళి యళుచ్చి స్తుతులను,మత్త గజమునణిచిన శ్రీ కృష్ణుని,ఉదయముననే వినిపిస్తున్న కోడి కూతలను,తీగెల పందిరిపై నున్న కోకిల గానములను (నప్పిన్నాయ్-చిన్నపిలా) మన గోపిక వినుచున్నది. ఇది సామాన్యార్థం.
మన గోపిక వ్రత ప్రారంభ శుభ సూచకముగా,రూప సౌందర్యమునధిగమించి,భావ సౌందర్యముతో పయనిస్తూ,అద్భుతానుభూతికి లోనవుతోంది.
మదపుటేనుగు మనలోని ఇంద్రియములు.వానిద్వారా లభించే అహంకారమే స్రవించుచున్న మదజలము అటువంటి ఏనుగును లోబరుచుకోగలిగినది ఆ గోపాలుని కరుణ అను అంకుశము.
అయితే మళ్లలేని నోళ్లు గల కోళ్ళు మనము రోజు చూస్తున్న కోళ్లేనా?అవి ఎందుకు ఆపకుండా "కొక్కొరోకో" అంటున్నాయి.మీకు తెలియని విషయమా ఇది-అవి మన స్వామికి ఆప్తమిత్రుడైన కుక్కుటేశ్వరస్వామి (కోడి రూపములో నున్న శివుని)సుప్రభాత సేవలు.శుభోదయ శుభాకాంక్షలు.
నిరంతరము కొనసాగే మాధవనామ స్మరణల మాలికలే ఈ మాధవీలతలు.వానిని అల్లుచున్న పరమాత్మయే పందిరి.ఆ పందిరిపై గుంపులుగా కూర్చుని మధుర గానము చేస్తున్నవి మన నల్లనయ్య బహురూపముల పిల్లన గ్రోవి పిలుపులే. మాధుర్యములో.గోపిక రూప భావ సౌందర్యములను సమన్వయించి సాధనకు సాగుచున్నది.
మన రామదాసు తన దాశరథి శతకములో "పరమ దయానిధే.......".హరే" అటంచు సుస్థిర మతులై సదా భజనచేయు మహాత్ముల పాద ధూళి నా శిరమున దాల్తు,మీరటకు పోవకుడంచు...అదే భక్తాంఘ్రి రేణుం భవతారమీడే.అని కీర్తించిన శ్రీ తొండరడిప్పొడి ఆళ్వారుని (అదేనండి మనము ఆప్యాయంగా పిలుచుకొనే విప్ర నారాయణుని) దర్శించి భక్తిలో మరొక మెట్టు ఎక్కుతోందని ఆలోచిస్తున్న నా మనసు అమ్మ వెంట వ్రతముచేయుటకు అనుసరించుచున్న గోపికలతో తన అడుగులను కదుపుతోంది.
( ఆండాళ్ తిరు వడిగళే శరణం )
No comments:
Post a Comment