ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు
కప్పం తవిర్కుం కలియే ! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కు
వెప్పం కొడుక్కుం విమలా!తుయిల్ ఎరాయ్
శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్
నప్పినై నంగాయ్ తిరువే తుయివెళాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై
ఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.
ఓం నమో నారాయణాయ-20
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
"ముప్పదిమూడుకోట్ల దేవతల" ధర్మ సం స్థాపనమైన
శిష్ట రక్షణమను కృష్ణుని " భుజ పరాక్రమములో"
శరణాగత రక్షణమున " శత్రువులను వణికించినదైన"
సర సరా పాకుతున్న " భయము తెచ్చు వెప్పంలో"
మండుచున్న కట్టెలు " చిగురించుచున్నవైన"
"వేణుగానమును ఆపమన్న" బువ్వ వండు తల్లిలో
గోపాలునితో గోపికలు " స్నానమాడుటకు కోరినవైన"
" విసనకర్ర-అద్దమును" అమ్మను ప్రసాదించమనుటలో
అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె
ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
ముప్పదిమూడు కోట్ల దేవతలనిశ్చింతను,శ్రీ కృష్ణుని శరణార్థుల శత్రువులకు భయముతో వచ్చిన జ్వరమును (తెప్పం) వేణుగానమును ఆపమని స్వామిని ప్రార్థించిన తల్లిని,స్వామితో కలిసి స్నానమాచరించుటకు విసనకర్రను-అద్దమును అడిగిన గోపికలను మన గోపిక చూచుచున్నది.దీనిని పరిశీలిస్తే,
అష్ట వసువులు-8,ఏకాదశ రుద్రులు-11,ద్వాదశాదిత్యులు-12,అశ్వినీదేవతలు-2,మొత్తం 33 మంది,ఇక్కడ కోట్ల అను పదము సమూహమునకు అన్వయిస్తుంది వారందరు శ్రీ కృష్ణునిచే పరి రక్షింపబడుతున్నారు.
శ్రీ కృష్ణుని శరణముకోరిన వారు తమలోని దుర్గుణములు శ్రీ కృష్ణుని అజేయుని చేయునని నిలువెల్ల వణికించుచున్న( వెప్పంలో) జ్వరముతో నున్నారు.వారి శరీరమును వారి పాపకర్మ ఫలితములు వణికించుచున్నవి.
" జాన పదమా-జ్ఞాన పథమా" అని, ఈ తల్లి స్వామిని వేణుగానమాపమని శాసించుచున్నది.పిల్లవాడు ఆకలీఅని ఏడుస్తున్నాడు.తల్లి త్వరత్వరగా ఎండుకట్టెలు పొయ్యిలో పెట్టి అన్నము వండుచున్నది.ఇంతలో పొయ్యిలో మండుతున్న కట్టెలు
మండటము మరిచి,చిగురించి వేణుగానమునకు ఆనందముతో తలలూపుచున్నవి.తల్లిప్రేమ నల్లనయ్యని శాసించినది.స్వామి తల్లికి తలవంచినాడు.కట్టెలచే బువ్వ వండించి తరింపచేసినాడు..భక్తవశుడు మన భగవంతుడు.
గోపికలు స్వామితో స్నానమాడవలెనని కోరారు.స్వామితో స్నానమాడుట అంటే.స్వామి మంగళ గుణగానములో మునిగిపోవుట.స్వామికి-స్వామి దయకు అభేదమును సూచించు చున్నది.స్నానమునకు వారికి కావలిసినవి అద్దము-విసనకర్ర.అద్దము అనగా స్వస్వరూపమైన స్వామిరూపమును చూచుకొనుటకు స్వచ్చమైన మనసు..రాగి అద్దము శ్రేష్ఠమైనది.వైరాగ్యమునకు ప్రతీకయే రాగి అద్దము.పూరిక్షేత్రములో జగన్నాథస్వామికి రాగి అద్దమును చూపిస్తారట!విన్నాను.
విసనకర్ర .తాను నిశ్చలమైనదైనా చలనముతో అందరికి గాలిని,గాలితో పాటు హాయిని ఇస్తుంది.సుగంధమైన దుర్గంధమైన ఒకటిగానే స్వీకరిస్తుంది.మిత్రులని-శత్రువులని భేదములేకుండా చేయు సహాయతాభావ నిదర్శనమే ఆ విసనకర్ర.శేషత్వ తత్వము-పరతత్వము,తిరుమంత్రము-ద్వయమంత్రము అని కూడా ఈ భావమును గౌరవిస్తారు అని తెలుసుకొనుచున్న గోపికతో పాటుగా నా మనసు వ్రతముచేయుటకు అమ్మను అనుసరిస్తున్న గోపికలతో తాను అడుగులు వేస్తున్నది
.
( ఆండాళ్ తిరువడిగళే శరణం)
No comments:
Post a Comment