సంభవామి యుగే యుగే-సాక్ష్యములు హరి ఆభరణములు
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
చేర రాజవంశములో దృఢ మహారాజు పుణ్యము
పుత్రునిగ ప్రకటితమైనది శ్రీహరి కౌస్తుభమణి
ముదలి ఆళ్వారుచే పంచ సంస్కారములను పొంది
అవతారములలో రాముని,అర్చావతారములలో వెంకటేశుని
నిరతము భాగవతులలో దర్శిస్తూ-సేవిస్తూ
పెరుమాళ్ భక్తి అనే పెద్ద మడుగులోని చేపయై
జీవిత నాలుగుదశలను జీవుడిగా తరియిస్తూ
"కుల శేఖర పడి" పేరిట గర్భగుడి ముందర గడపగ
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థముచాటిన కుల శేఖర ఆళ్వారు పూజనీయుడాయెగ.

No comments:
Post a Comment