Thursday, January 25, 2018

NAKKA NAAYANAR



కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాఽపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||౫||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శివమానసపూజాస్తోత్రం సమాప్తమ్ ||
చిదానందరూపం శివోహం-శివోహం
****************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకుందునా
సాలీడు పాకగ స్వామి శరీరము పొక్కిపోయె
గ్రహచారము చాలక ఎర్రగ కందిపోయె
పాయని భక్తి తానొక ఉపాయము సేసి వేగమే
జాలము చేయక ఉపచారము చేయుచు సాగిపోయె ఆ
నక్కనయనారుని ధర్మపత్ని,గమనించిన నాయనారు
క్షమియించగ కోరగ,ఆమె వైద్యమే సరియనె సాంబుడు
గాఢత ఎంత ఉన్నదో కద ఆ మూఢపు భక్తిలో
నెమ్మదినీయగ స్వామికి తల్లి ఉమ్మియె కారణమాయె
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...