సంభవామి యుగే యుగే సాక్ష్యములు హరి ఆయుధములు
ధర్మ సంస్థాపనయే లక్ష్యమైన మన ఆళ్వారులు
తిరుక్కరయులూరులో తిరువాలి దంపతులకు
నీలుడుగా ప్రకటితమైనది శ్రీహరి శార్ఙము
శత్రువులకు కాలుడుగా శౌర్యము వెలువరచుచు
పరకాలుడు అను పేరుతో ప్రసిద్ధుడైనాడు
అప్సరస కుముదవతిని అర్థాంగిగా కోరిన
అద్భుత పంచ సంస్కారములతో పునీతుడై
అతివమీది ప్రేమతో ఆచరించుచున్న వ్రతము
పెట్టిన పరీక్షలే భక్తికి పెట్టని గోడలాయె
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొను
పరమార్థము చాటిన తిరుమంగై ఆళ్వారు పూజనీయుడాయెగ
No comments:
Post a Comment