Thursday, January 25, 2018

ADIVO-ALLADIVO NAMMALWARU


 సంభవామి యుగే యుగే సాక్ష్యములు  హరి సైన్యములు
 ధర్మ  సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు

 తిరునగరిలో కొలివీరి  ఉదయనంగ  దంపతులకు
 మారన్ గా ప్రకటితమాయెను  విష్వక్సేనుడు

 కను తెరువడు  ఏడువడు  పాలను స్వీకరించడు
 వింతగ చింతచెట్టు తొర్రలో పద్మాసనుడైనాడు

 ఉత్తర్-దక్షిణ దిక్కుల ఉజ్జ్వలించు జ్యోతులుగ
 మధురకవితో  ప్రథమముగ మాటలాడినాడు

 నాలుగు వేదములను తమిళములో తిరు గ్రంథములుగ రచించి
 నాలుగు దిక్కులను  హరి తత్త్వమును  చాటించి

 నిత్య నిర్గుణ నిరంజనుని  నిరతము మది నిలుపుకొని
 పరమార్థము చాటిన నమ్మాళ్వారు పూజనీయుడాయెగ


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...