ఎవరికి చెబుతుంది అమ్మ
ఏమని చెబుతుంది అమ్మ
ఎండమావి ప్రయాణంలో
బండబారి ప్రయాసలో
అడియాశల ఆయాసంలో 11ఎవరికి11
పెద్దతనము తన్ను ఎద్దేవా చేయువేళ
ముద్దుగుమ్మగాదు అమ్మ
మొద్దుబారిన రాతిబొమ్మ
విరిగిన తన రెక్క చూసి
యెగరలేని తనము తెలిసి 11ఎవరికి11
కళకళలాడే బ్రతుకు
విలవిలలాడే గతుకుగ
మిగిలిన తన ఏకాంతంలో
నిట్టూర్పుతో సాగింది
నిశీతో తన పయనానికి
......................అప్పుడు
నిశి వెనుకే ఎప్పుడు వెలుగే కనిపిస్తుందని
వేకువమ్మ చెప్పింది తాకుతూ ఆ అమ్మని
.....................
శిశిరంలో ఉన్నావు,వసంతమే వస్తుస్తుందని
చెట్టుతల్లి చెప్పింది గట్టిగా ఆ అమ్మతో
...............
ఎండవెనుక తప్పక వెన్నెలమ్మ వస్తుందని
జాబిలమ్మ చెప్పింది జాలిగా ఆ అమ్మతో
.............................. ......
వాన వెనుక తప్పక హరివిల్లే వస్తుందని
అంబుదమే చెప్పింది బంధువులా ఆ అమ్మతో
................
తీయనైన మాయమాటా
మోయలేని నీటిమూట అనుకొనే ఆ అమ్మ
.........................
నిత్యమైన ప్రకృతిలో
సత్యమైన పలుకులు విని
ఋజువు దొరికి,నిజము తెలిసికొని
.............................. .........
ఆగదు శోకాగమనానికి
ఆపదు తన గమనాన్ని.
No comments:
Post a Comment