Thursday, January 25, 2018

PRADYUMNAE SRUNKHALAADEVI

    ప్రద్యుమ్నే శృంఖలాదేవి

  " ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖల నామ భూషితే
    విశ్వ విమోహితే దేవి శృంఖల బంధనాశిని"

   వంగదేశములోని  ప్రద్యుమ్న నగరములో పడిన మాయా సతి పొట్ట భాగము "శృంఖలాదేవి" గా ఆరాధింపబడుతున్నడి.ఈ తల్లిని" శృంగలాదేవి","సిం హళాదేవి" అని కూడా ఆరాధిస్తారు.

  సిం హళ అనే శబ్దమునకు సంకెల -బాలెంత నడుము కట్టు అని కూడా వ్యవహారములో ఉంది.స్థలపురాణము ప్రకారము ఈ ప్రదేశములో ఋష్యశృంగ మహాముని అమ్మవారిని  పూజించి,కటాక్షమునకై తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట.ఇక్కడ మనకు "ఋష్యశృంగము" అను పెద్ద కొండ ఆ ముని గుర్తుగా మనకు దర్శనమిస్తుంది.అతడు అమ్మతో సహా కర్ణాటక లోని  శృంగేరీ పీఠమును దర్శించి తిరిగివచ్చి ఈ స్థలములో అమ్మ శక్తిని ప్రతిపాదితము చేశారట.భక్తానుగ్రహముతో తల్లి శృంగలాదేవి నామముతో ఆరాధింపబడుతుందట.

  ఇంకొక ఐతిహాసిక కథనము ప్రకారము ధర్మనిరతికై శ్రీకృష్ణపరమాత్మా రుక్మిణీమాతలను పరీక్షింపదలచి వారిని బండికాడికి కట్టి లాగమన్నాడట.లాగుతున్న సమయములో అమ్మవారికి దాహమువేయగా స్వామి   జలమును అందించినాడట.అమ్మ దప్పి తీర్చుకొను సమయమున దూర్వాస మహర్షి తన అనుమతిలేకుండా అమ్మ నీరు తాగినదని,స్వమ్మి జలమును ఇచ్చాడని వారికి 12 సంవత్సరములు ద్వారకానగర బహిష్కరణను శిక్షగా విధించాడట.ఆ సమయములో  అమ్మ రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని ప్రసవించి నడికట్టుతో ప్రజలకు దర్శనమిచ్చిందట.ఆ తల్లినే విశ్వమాత శృంఖలాదేవి యని అమ్మతనమును కీర్తిస్తూ మాఘమాసములో తప్పెట్లతో తాళాలతో జాతర జరుపుకుంటారు కోయజాతి జనులు.

   రుక్మిణీమాత సుతుడైన ప్రద్యుమ్నుని గౌరవముగా ఆ క్షేత్రము ప్రద్యుమ్నే నామముతో పవిత్రమైనది.
   ఎవ్వరు బంధించలేని "విశృంఖలాదేవి" మాతృ వాత్సల్యముతో పచ్చి బాలెంత గా మనకొరకు నిత్య పథ్యమును చేస్తూ,"జగద్రక్షణా బాధ్యత" నడికట్టును తనకు తాను బిగించుకున్నది ఆ తల్లి.
  తన చాతుర్మాస యాత్రా సమయమున ఆదిశంకరాచార్యులవారు ఈ స్థలమందలి పంచభూత పవిత్రప్రకంపనలను గుర్తించి ప్రశంసించారట.

  గుడి రూపురేఖలు నేడు మారినను తన నడికట్టు ఒడి లాలన ఏ మాత్రము మారని ఆ శృంఖలాదేవి మనలను భవబంధ విముక్తులను చేయుగాక.

     శ్రీ మాత్రే నమ: 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...