Thursday, January 25, 2018

NEELAKANTHA NAAYANAARU



" సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ 
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు "
చిదానందరూపా-నీలకంఠ నాయనారు
******************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
నీలకంఠ నాయనారు వృత్తిరీత్యా కుమ్మరి
గృహస్థధర్మములోనున్న శివకీర్తనా నేర్పరి
రక్షకుడు శివుడంటు భక్తులను కొలిచెడివాడు
భిక్షకులకు దానముగా భిక్షాపాత్రలనిచ్చేవాడు
కాలపు పరిహాసమేమొ కామవశుడైనాడు
కానిపనికి శిక్షగా భార్యను తాకకున్నాడు
ఒకయోగి భిక్షాపాత్ర నాయనారు యోగమునే మార్చినది
కామేశుడు కరుణించుటకు కామము కారణమాయెగ
చిత్రముగాక ఇదేమిటి చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక.
ధర్మము భక్తుడు నిర్దేశించినది.భక్తి భగవంతుడు అనుగ్రహించినది.నీలకంఠ నాయనారు భగవత్ నిర్దేశితమైన గృహస్థధర్మమును పాటిస్తూ.ఈశ్వరానుగ్రహ భక్తితో శివభక్తులకు భిక్షాపాత్రలను దానమిస్తూ శివుని సేవించెడివాడు.కాముని చంపిన వాని ఆట ఏమో ఒకసారి కామవశుడైనాడు.దాని పరిహారముగా తన భార్యను తాకక బ్రహ్మములో చరించసాగాడు.భక్తుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చుటకు శివయోగి వారిని సమీపించగా,"అతిథిదేవోభవ" యనుచు వారు తమ ఆతిథ్యమును స్వీకరించమని ప్రార్థించిరి.అందులకు యోగి తనకొక నియమము కలదని దంపతులు చేతులు పట్టుకొని పుణ్యస్నానము చేసిన తరువాత ఆతిథ్యమును స్వీకరిస్తానన్నాడు.పెద్ద ధర్మ సంకటము.స్నానము చేసిన నియమ భంగము అవుతుంది.స్నానమును చేయకపోతే అతిథిని నిరాదరించినట్లు కదా.తీవ్రముగా ఆలోచించి వారు ఒక కర్రను తమమధ్య అడ్దముగా పెట్టుకొని స్నానమాచరించసాగిరి.సంతసించిన సదాశివుడు వారిని తరింపచేసినట్లే మనలను తరింపచేయును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...