పండుతూ తాంబూలం-ఎండుతూ గోరింట
ఎర్రగా నవ్వాయి.ఆ ఎరుపునువ్వేనా?
క్షణములలో కరిగిపోవు ఎర్రరంగు కానునేను
ఝా న్సీ,రుద్రమ రోషపు ఎర్రరంగు నేనమ్మా.
...........................................
కురుస్తూ మేఘము,మెరుస్తూ కాటుక
నిగనిగలాడింది నల్లగా.ఆ నలుపు నువ్వేనా?
నీటితో,కన్నీటితో కరిగిపోవు నలుపు నేనుకాను
క్లేశభరిత పాంచాలి ముడువని కేశముల నలుపమ్మా.
.........................................................................
చేతిలో వెన్నముద్ద,రాతలోని సుద్దముక్క
తెల్లగా నవ్వాయి. ఆ తెల్లరంగు నువ్వేనా?
కరిగిపోవు,చెరిగిపోవు తెల్లరంగు కాను నేను
చండాలిక సంస్కారపు తెల్లరంగు నేనమ్మా.
..........................................................
ఊదారంగు పూవు,చాట్బండి ఉల్లిపాయ
ఊరిస్తూ నవ్వాయి. ఆ ఊదారంగు నువ్వేనా?
మూనాళ్ళ జీవితం,తరిగితే కన్నీళ్ళు నేనుకాను
సరోజిని ఉపంయాస ఉత్కంటంత ఊదాను నేనమ్మా.
..................................................
అలలు లేని కడలి,మొయిలు లేని ఆకాశం
నీలముగా నవ్వాయి. ఆ నీలం నువ్వేనా?
అలల,మొయిలు చాటు దాగు నీలిరంగు నేనుకాను
మానవత వినీల థెరెసాచీర నీలీంచు నేనమ్మా.
..............................................
విచ్చుతున్న తామర,ముచ్చటైన పచ్చిక
ఆకుపచ్చగా నవ్వాయి. ఆ ఆకుపచ్చ నువ్వేనా?
కత్తివేటు కాలరాయు ఆకుపచ్చ కానునేను
తులతూయలేని తులసిదళపు ఆకుపచ్చ నేనమ్మా.
...........................................................
మడిలోని నిమ్మపండు,జడలోని చామంతిపూవు
పచ్చగా నవ్వాయి. ఆ పచ్చరంగు నువ్వేనా?
వెచ్చదనముసోకగానే మచ్చలుపడు పచ్చ కానునేను
క్యూరీ పరిశోధనల పచ్చదనము నేనమ్మా.
..........................
రంగుల హంగులన్నీ రంగరించుకొని మహిళ
తడబడక పడవ నడుపు సరంగు,సర్వ మంగళ.

No comments:
Post a Comment