"లంచం"దండకం
===============
===============
దాసోహమమ్మా,ఇహలోక సంచారిణి,
బహురూప వరదాయినీ,చిద్రూప చింతామణి.
బహురూప వరదాయినీ,చిద్రూప చింతామణి.
ఓ విదుషీమణీ
మస్కాలకు,నమస్కారాలకు ఆస్కారమే లేదంటు శూన్యమై,
ధన,కనక,వస్తు,వాహనాదులకు ఆస్వాదనే వేదమంటు సూక్ష్మమై,
మనోవాక్కాయ కర్మాభిలాషలను భేషుగ్గా అందించు ప్రత్యక్షమై,
ధన,కనక,వస్తు,వాహనాదులకు ఆస్వాదనే వేదమంటు సూక్ష్మమై,
మనోవాక్కాయ కర్మాభిలాషలను భేషుగ్గా అందించు ప్రత్యక్షమై,
ఓ శుభలక్షణా
తూర్పు తిరిగిన దండంబునకు ఓదార్పుగా
పడమర చేరి కనుమరుగవని ఓ నేర్పుగా
ఉత్తరువులందించు ఉత్తరపు ఓ మార్పుగా
ప్రదక్షిణలు చేయించు ఓ కూర్పుగా
పడమర చేరి కనుమరుగవని ఓ నేర్పుగా
ఉత్తరువులందించు ఉత్తరపు ఓ మార్పుగా
ప్రదక్షిణలు చేయించు ఓ కూర్పుగా
ఓ పరాత్పరీ
వీలుకానిదేదీ లేని పలు వీలునామాల నందించు వకీలుగా
నైవేద్యో నారాయణో హరి కీర్తింపబడుచున్న ఆచారిగా
మిథ్య విద్యాలయాలఓ గుణపాఠాలు నేర్పించే ఒకే ఒజ్జగా
తడిసిన ఇరుచతుల వరముల జడివానలు కురిపించు ఓ వరుణిడిగా
నైవేద్యో నారాయణో హరి కీర్తింపబడుచున్న ఆచారిగా
మిథ్య విద్యాలయాలఓ గుణపాఠాలు నేర్పించే ఒకే ఒజ్జగా
తడిసిన ఇరుచతుల వరముల జడివానలు కురిపించు ఓ వరుణిడిగా
అలివేణి కరుణామయి నీవు
తాత్సారపు వాత్సల్యమా
కార్యాలయాలకేరింతలాడు ఉత్సాహమా
తారుమారులకు వీరతాడగు ప్రోత్సాహమా
తాను జతకూడనను వాని బతుకు జుగుప్స వా
తాత్సారపు వాత్సల్యమా
కార్యాలయాలకేరింతలాడు ఉత్సాహమా
తారుమారులకు వీరతాడగు ప్రోత్సాహమా
తాను జతకూడనను వాని బతుకు జుగుప్స వా
ఓ ఈప్సిత ప్రదాయినీ,
మూఢులు కాంచమబొల్లకే ఇనుము కోరు చందంబున,
ఉంచమని అందిస్తూ,లంచమని నిందిస్తూ,తుంచమని చిందులేస్తుంటే.
సూతుడు శూరతనొందుట,శూరుడు నిర్వీర్యుడగుట(కర్ణుడు,ఏకలయుడు)
వరవిక్రయ క్రయములు,పూర్ణమ్మ ఆక్రందనలు,
మహరాణుల అరనములు,విడిపోయిన భరణాముల
వివరణాలు కావాలంటూ ,చిరు మందహాసములు చిలికిస్తూ,
నయగారములు ఒలికిస్తూ,నిలదీసినావమ్మా నీ చాకచక్యముతో

ఓ లోకేశ్వరీ
నీలాపనిందలను తొలగించ వేలాది మార్గాలున్నాయని,
అచ్చులను చేర్చ్కుని ముచ్చతను తీర్చుకోవచ్చనీ,
వాస్తు కుస్తీలతో మస్తీలనే చేయొచ్చనీ, అంకెలో, లంకెలో పొంకముగా,
నీ అంకమున కూర్చుండగా, మా వాంచితములను తీర్చు "లాంచనం"గా నీ పేరునే మార్చేసుకుని, ఔరౌరా అనిపించుకున్న నిన్నెరుగ నేనెత వాడినమ్మా,
నీ లీలలు ఎరుంగని నన్ను అవలీగా మన్నించి నాకు కనువిప్పు కలిగించి,
బహు మెప్పు తరలించి, కొంగు బంగారమై, నన్నేలు ఓ కల్పవల్లీ నీవే సమస్తబు,
నమస్థే నమస్థే నమో నమ:

vimala kowtha (not to blame anyone)
No comments:
Post a Comment