సిత్రాలు సూడరో
పరి పరివిధముల మనసు
పరుగిడుతున్నప్పుడు,అడగాలనిపిస్ తుంది......ఒకటి
.................
ఆ ద్రుపద కుమారికి అక్షయపాత్ర లభించుట
ఆ గాంధార కుమారులను ఆకలి కబళించుట
..................
ఆ పాంచాలికి వరముగా చేలములు అందించుట
అభిమానముతో సుధామ కుచేలునిగా మిగులుట
..................
ఖాండవమును దహించమని అగ్నిని ఆదేశించుట
అగ్ని భయము లక్క ఇల్లు పాండవులను తరలించుట
...............
రక్కసుడని అక్కసుతో గాలి తీసివేయుట(వృతాసురుడు)
వెదురుకు గాలినిడి వేణువుగా మలచుట
.................
అలసట తీర్చగ వేల్పుల తులసిని చెట్టుగ చేయుట
ముద్దు ముద్దు చేష్టలతో మద్దులను మన్నించుట (నలకూబరులు)
..................
సూర్యుడిని తరలించి కర్ణుని సృష్టించుట
సూర్యుడిని మరలించి సైంధవుని వధించుట
........................
చేతివేలి చక్రముతో ఉత్తరను మాతను చేయుట
చేతివేలి సంకేతములతో జరాసంధుని అంతము చేయుట
తప్పులను లెక్కించి తలనే ఖండించుట (శిశుపాలుని)
మా లెక్కలేని తప్పులను మక్కువతో మన్నించుట
.............
నిజమేమో...కాదేమో...నైజమేమో... అవునేమో
మనో నేత్రాలు తెరిచి నీ సిత్రాలను సూడనీ.
No comments:
Post a Comment