Friday, June 23, 2017

మన దసర

అయోధ్యలో కౌత్సుడు వాత్సల్యముతో పంచిన
"వరహాలు"రా మన దసరా.
ఆయుధపూజకు పాండవులు మోదముతో వేసిన
"నాంది"రా మన దసరా.
ఆయుధ విన్యాసాల యోధవాడ కాగడగ చూపు
"ఆకాడా"రా మన దసరా.
ఆ శక్తులు ఐక్యతతో అశక్తతను తొలగించిన
"శక్తిపటము"రా మన దసరా.
ఇళ్ళకొచ్చి వేనోళ్ళ దీవించే పంతుళ్ళ మామూళ్ళ
"ఆనవాళ్ళు"రా మన దసరా.
కళకళలాడే నిష్కళంక మనసులు ఏ వేళలో తెలుపుచున్న
"కళారాలు"రా మన దసరా.
వేర్వేరు రూపాలతో వేదనను మర్దించే పోటిలేని
" పార్వేటరా" మన దసరా.
బమ్మ బొమ్మలందరి చల్లదనము కోరేటి కమ్మనైన
"బొమ్మల గోలు"రా మన దసరా.
మానికలో వడ్లు కొలిచి,తలమానికమని తలచే మేలైన
"మాన బాన"రా మన దసరా.
పశువులో పశుపతిలో చూపించే భారీ
"ఏనుగు అంబారీ"రా మన దసరా.
కుడ్యచిత్రాలతో, ప్రతిష్ఠలతో కూడి మెండైన
"గర్భా ఉత్సవము"రా మన దసరా.
ముప్పులను తప్పించిన తెప్పొత్సవ గొప్పవైన
"ప్రభలు"రా మన దసరా.
రాళ్ళయుద్ధ హేలను,రావణ కా ష్టమును చూపు రమ్యమైన
"రామలీ ల"రా మన దసరా.
వడిదుడుకులు కడతేరిచి,తోడునీడగా నడచు ఆ
"పైడితల్లి"రా మన దసరా.
గతుకుదారినతికించి,కతుక మెతుకునందించు బంగరు
"బతుకమ్మ"రా మన దసరా.
నవరసాల నవరాత్రులు,పగ విడువగ పది పగలులు ఒద్దికగా జరుపుకొనే
"ముద్దబంతిపువ్వు"రా మన దసరా .
సనాతనపు పందిరిగా,సం స్కృతుల సుందరిగా,సౌరభాల విరిగా మారు
"సరదాలు"రా మన దసరా పండుగ.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...