బుక్కెడు బువ్వకు నాను
దిక్కులు సూత్తుంటేను
చుక్కలనే తెస్తాను
ఓటెయ్-అంటడు దొర
..........
గుక్కెడు నీళ్ళకు నాను
తొక్కిసలాటలో పడితే
చెక్కులు ఇప్పిస్తా ఎంచక్కా
ఓటెయ్-అంటడు దొర
...........
బొక్కలన్నీ ఇరిగి నాను
బిక్కమొగముతో నుంటి
చక్కనైన ఇల్లు నీకు
ఓటెయ్-అంటడు దొర
............
అయ్యయ్యో పెయ్యేమో
సలసలమని కాగుతుంటే
కారు తెస్త,తోలుకెల్త
ఓటెయ్-అంటడు దొర
............
పాపాలలోకమున నాను
పాలుపోక కూసుంటే
కొలువిప్పిస్త గంద
ఓటెయ్-అంటడు దొర
..........
దొరతనము దిగివచ్చిన
ఓటెంత గనము మరి
బాంచెన్ నే మొక్కుతా
నా (హ) అక్కును తొక్కొద్దు దొర.
No comments:
Post a Comment