Friday, June 23, 2017

తమాషా (కాదు)


పనికిరాని మాటలు బహు బాగున్నాయంటావు........
మసకబారిన కంటికి జోడును తగిలించి
బంగారు ఫ్రేము అంటు నీ ఫేమును చాటుతావు......
ఊడిన దంతాలకు మోడలు చేయించి
పెట్టుడు దంతాలతో కట్టుకథలు పలుకుతావు....
తెల్లబడిన కురులకు నల్లరంగు అంటించి
ఎల్ల వేళలా నేను యువకుడిని అంటావు....
నేవళం తగ్గిన చర్మపు ముడతలు మడత పెట్తేసి
ఆధునిక నైపుణ్యం అంటూ అదిరిపోతు ఉంటావు.....
అదనపు సాయాలతో పదునుపెట్టుతుంటావు
ముద్దు మోము అందానికి హద్దే లేదంటావు....
....................................................................................................................................................................................................మోజు పడ్డ తనువుకు లీజు ఎప్పుడవుతుందో
పొంచి ఉన్న గడువు నిన్ను ఎపుడు ముంచేస్తుందో
పేక మేడ కూలిపోతు కేకలెన్ని వేస్తుందో
ఒక్కసారి ఆగు,ఆలోచించు
..........
పెద్ద మనసు నీదికాదా
సాయమనే వ్యవసాయం వ్యవధి లేక చేస్తుంది
ఒద్దికగ ఉంటుంది,నిన్ను చక్కదిద్దు తుంటుంది
వద్దన్నా వస్తుంది,వయసు హద్దు లేనిదది
ప్రతిఫలాపేక్ష లేక ప్రతి మదిని నిలుస్తుంది
చిరునవ్వులు చిందిస్తూ నిన్ను చిరాయువుని చేస్తుంది.
....మీరు ఏమంటారు?

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...