మంచితనపు మారాకులు
**********************
తోకముడుచుకొమ్మనగా ముసిరే చీకట్లను నే
ఆకులో ఆకునై తాకనా వేకువనే
కల్పాంతమున హరికి తల్పమైన రావాకు
ప్రతిసృష్టికి ప్రతిరూపము లేలేత తమలపాకు
తాపత్రయము మానమనే తత్త్వబోధ తామరాకు
ముంచు మాయ తొలగించే మంచి చింత చింతాకు
కటకట మోటుచేటు చాటేది అరిటాకు
కోట్లనుతలదన్నేది,కోటగలది తులసాకు
ఇంటింటను ఇంతులకు పేరంటము గోరింటాకు
నమ్మలేని నిజాలున్న సొమ్మురా మన జమ్మాకు
అంగరంగ శుభముల సంగంబు మామిడాకు
మొక్కవోని సిరులురా మొక్కలిచ్చు ఆకులు
మనతెలుగున ఆకులు మంచితనపు మారాకులు.
No comments:
Post a Comment