సౌందర్య లహరి-92
పరమ పానమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సింధువులో స్థూలముగా,బిందువులో సూక్ష్మముగా
పెద్ద కొండలో స్థూలముగా,అద్దములో సూక్ష్మముగా
పుడమిగా స్థూలమై,కణముగా సూక్ష్మమై
వాయువుగా స్థూలమై,శ్వాసగా సూక్ష్మమై
సుందరములో స్థూలమై,అందరిలో సూక్ష్మమై
బ్రహ్మాండములో స్థూలమై,పిండాండములో సూక్ష్మమై
విస్తుబోవచేయుచున్న నీ నిస్తుల వైభవము
స్థూలములో మార్పులేక సూక్ష్మములను చేయువేళ
నీ మ్రోలనే నున్న నా కేలును విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment