సౌందర్య లహరి-89
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
భౌతిక-ఆధ్యాత్మిక కలయిక భావోద్వేగముగా
ఆత్మ-పరమాత్మల కలయిక తాదాత్మ్యముగా
సన్యాసము సం సారపు సారపు సాక్ష్యముగా
త్రిగుణముల సంగమము నిర్గుణ ప్రాకారముగా
పవిత్ర అపవిత్ర అల్లిక పరమాత్మ తత్త్వముగా
శివ-పార్వతుల సంభాషణలు శిరోధార పూజ్యముగా
ప్రతి బంధకములే మోక్షపరికరములుగా మారగా
అనుగ్రము అల్లుకుంటు తంత్రములగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment