సౌందర్య లహరి-36
పరమ పావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ధ్యానము-ధ్యాత-ధ్యేయము త్రిపురములు గాగ
స్థూల-సూక్ష్మ-కారణ శరీరములు త్రికములుగ
త్రిపుటీ స్వరూపమే ద్వైతముగా భాసిల్లగ
త్రిపురాసుర సం హారమే అద్వైతముగా
అనంగుడు-అల్పాయువు -అసమర్థుడు నీ కరుణ
అఖిల జగములను అమితముగ ఆకర్షించుచున్నాడు
నీ దయార్ద్రహృదయము దాసుని అర్హతనే చూడదుగా
అసాధ్యములన్నీ నీ దయతో సుసాధ్యములగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment