సౌందర్యలహరి-70
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
చీకటిని చూడాలనే తీరని సూర్యుని కోరికకు
పీకలలోతు దీనత్వపు నా వదనము వేదిక
జాణను నేననుకునే మందబుద్ధి పోలికకు
జ్ఞానిని నేననుకునేలా చేసిన మూఢత్వపు చేరిక
అరి భయంకరిడిననే అతిశయపు వాడుక(కు)
అరిషడ్వర్గములు నాతో ఆడుచున్న వేడుక
ఉపయోగములేని వాని ఊహలలో సోలిపోయి
మత్తువదిలి మన్నించమని అడుగుతూ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment