సౌందర్య లహరి-90
పరమ పావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
దక్షుని అజ్ఞానమును శిక్షింపగ దలచి
సాక్షాత్కరించావు సతిగ దక్ష వాటిక
తారకుని తామసము తొలగింపచేయ దలచి
కటాక్షించావు హిమవంతుని పార్వతిగ
మహిషాసురుని మదమును మర్దింపదలచి
మహిషాసుర మర్దనిగా మమ్ముల రక్షించావు
శుభప్రదముగ శంభునిచే కల్పింపబడిన
నీ రేఖాచిత్రములు యంత్రములగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment