సౌందర్యలహరి-85
పరమపావనమైన నీ పాద రజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా
అల్ల కల్లోలమైన మనసు నన్ను గిల్లుతోంది
ఎర్రనైన కోపములో నేను వెర్రి పనులు చేస్తున్నా
చిర్రు బుర్రులాడు మనసు నాపై గుర్రుమంటోంది
తెల్లనైన తెలివిలో నేను తెలుసుకోగ తప్పులన్నీ తప్పులన్నీ తెలుసుకున్నా
తెల్లబరచె నాలోని తెలివితక్కువతనాన్ని
సత్వ రజో తమో గుణములు సద్దుమణుగు చుండగా
నీ చిరునవ్వే విఘ్ననివారణమైన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment