సౌందర్య లహరి-80
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పలకమైన పరమాత్మ స్వరూపము
బిందువుగా సృష్టి ప్రారంభమును కేంద్రీకరిస్తూ
నింగిగా వ్యాపిస్తూ నాలుగు భూతాలను కలుపుకొని
శబ్ద-స్పర్శ-రూప-గంధ-రస భావనలుగా
పుష్పములలో ఐదు గుణములను చొప్పించి
మూడుకూటములు కలిగిన మూల మంత్రాత్మికవని
జడమగు ఈ శరీరము నీ చైతన్యశక్తిని ఎరుగక
జనన-మరణములు చర్విత చరణములగుచుండగా
శిశిరమగు చిత్తమునకు చైత్రము నీవైన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment