సౌందర్య లహరి-84
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఆదిశక్తి దాచెనమ్మ ఆదిదేవుని తనలో
ఆ శివుడు దాగెన్న ఆదిశక్తి రూపములో
హరిసోదరి నేరుపుగా హరుని కప్పివేయగా
కానరాదు శివుని జాడ కామేశ్వరిని చూడగా
త్రినయనములు జాబిల్లి శివతత్త్వ ప్రతీకగా
కుచద్వయము మేనిఛాయ శివాని స్వరూపముగా
శివశక్తుల కలయికయే చిద్విలాస వేడుకగా
నా హృదయ పీఠమే మృదు సిం హాసనమైన వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్యలహరి.
No comments:
Post a Comment