సౌందర్య లహరి-82
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సకలశాస్త్ర సమూహముల సారమైన నీ అందెలు
సామవేద సంగతుల స్వరమైన నీ అందెలు
నీ పాదములు తాకలేని నీలకంఠ వదనుని
చిత్తరమైన కొత్త తత్తరపాటును చూసి
అవ్వ? ఇది ఏమి సోద్యము?
మేము చూసినామంటూ చేసే సవ్వడులు
చిత్తుగ ఓడిపోయి ఏమిచేయలేని మన్మథుని
చిత్తపు పరిహాసముగ పకపక నవ్విన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment