సౌందర్య లహరి-86
పరమపావనమైన నీపాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఉన్నతమును ఎన్నలేక నాకన్నులెన్ని చూసినవో
విజ్ఞత మరచిన వినికిడి వింత పోకడలనే పోయినదో
తప్పుడు మాటలు అని తెలిసి పెదవి ఎంత విప్పుకుందో
చేయరాని పనులైనా చేయి ఎంత చేసినదో
హింసలోన నా మనసు కంసునిలా మురిసినదో
పరనిందా రోపణలో పాపమెంత పెరిగినదో
వికారములు విజృంభింప విధలేక నే చేయుచున్న
దీనారావములు శివాకార మంచము అగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
No comments:
Post a Comment