Monday, November 30, 2020

MEEDHUSHtAMA SIVATAMA-19

 


మీఢుష్టమ శివతమ-19

 ********************


 నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా

 నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవుకావ

 నన్ను విడిచి పారిపోకయా-


   "పృధివీచమ ఇంద్రశ్చమ-అంతరిక్షంచమ ఇంద్రశ్చమే-ద్యౌశ్చమ ఇంద్రశ్చమే"  వినిపిస్తోంది చమకములోని అర్థేంద్ర అనువాకము.


 ఈసారి భావమునుకూడ వివరిస్తున్నారు.భూమితో కూడివచ్చిన ఇంద్రుడు-ఆకాశముతో కూడి వచ్చిన ఇంద్రుడు-స్వర్గముతో కూడి వచ్చిన ఇంద్రుడు అంటూ.


  రుద్రా! ప్రతిసారి ఇంద్రశ్చమే-ఇంద్రశ్చమే అని అంటున్నారు.వీరందరితో పాటుగా తాను వెళుతున్నాడు.వారు మాత్రం ప్రత్యేకముగా కనిపించటములేదు.ప్రతిసారి తనను పేరుపెట్టి పిలుస్తేనే వస్తానన్నాడా ఏమిటి? అని రుద్రుని చెవిలో గుసగుసలాడాడు.


  "నమో బృహతేచ వర్షీయతేచ."


 దేశము-కాలము-వస్తువు అను మూడువిధములైన పరిమితులు లేనిది బృహత్ శబ్దము అదే బ్రహ్మము.


 గుణై వర్షీయతే.


  గుణములచే అధికముగా నొప్పువాడు.స్వరూపమును వేడుకగా ధరించువాడు అగు రుద్రునకు నమస్కారములు.



  ప్రారంభమైనది ప్రదర్శన.


 మిస్టర్.పృధ్వి గొప్పదనమును చెప్పనారంభించాడు నిర్దేశకుడు ఇంద్ర.


నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః.






  సహనమునకు మారుపేరు మా పృథ్వి.మా యజ్ఞం సినిమా  లోని     ఏ, ఏ  సన్నివేశాలు ఎక్కడ-ఎక్కడ చిత్రీకరించాలో,ఏవి అనుకూలమో-ఏవి కాదో,సహజత్వమునకు భంగము రాకుండా ఉండేటట్లు వెతికి,వెతికి నిర్ణయిస్తాడు.వాటిని మరింత అందముగా మలచుటకు ఎంతటి శ్రమనైనా విసుగులేక భరిస్తాడు.( ఎంతైన సుగంధభరితము కద మనసు.)

  నమ ఉర్వర్యాయచ-ఖల్యాయచ


 అన్ని సస్యములతో నున్నది భూమి.ధాన్యములనుంచు భూమి ఖల.


  భూమియందు ధాన్యరూపమున పుట్టినవానికొరకు,

  ధాన్యమును నూర్చు కళ్ళమునందుండు గుంజ మొదలగు రూపమున నున్న రుద్రునకు నమస్కారములు.


  పొలము పండుట దైవశక్తికి,కళ్లమును నూర్చుట మానవ ప్రయత్నమునకు సంకేతములు.



 


   అసలు పృధ్వి లేకపోతేనేనెక్కడ? నా సినిమా ఎక్కడ?



     " నమో రుద్రాయచ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః."



    తొణకడంలేడు పృథ్వి.ఇంద్ర భుజముపై చేయివేసి వాడేనేను-నేనే వాడు అన్నాడు.


   నమస్సోమాయచ-రుద్రాయచ.



  ఆకాశ్ గారు అంటు చూసింది ఆ అమ్మాయి

.ఇంద్రగారిని అసలు మాట్లాడనీయటములేదు.గడగడ నాకొక స్నేహితున్నాడమ్మా.వాడి పేరు ప్రణవ్.వాడు నేను కలిసి పాటలు.నేపథ్య శబ్దములు మొత్తము శబ్దసహకారాన్ని అందిస్తాము.కాకపోతే ఇంద్రగారు ఎటువంటి పనిని కోరుకుంటున్నారో దానిని నూటికి నూరుశాతము ఇచ్చేందుకు సహకరిస్తాము.( ఎంతైన శబ్దస్వరూపముకదా)



 నమో మేఘ్యాయచ-విద్యుత్తాయచ.


  అందుకే మీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు స్వర్గపు అంచుల్లో ఉన్న అనుభూతిని పొందుతున్నారు, అని అంటుండగా అవనిక కిందకు జారింది. పక్కకు తిరిగి రుద్రుని చూసుకుంటూ,



   చిక్కుకు పోయాడు నా చేతిలో అనుకున్నాడు సాధకుడు.

   చిక్కుకుపోయాడు ఇంద్రుని చేతిలో అనుకున్నాడు రుద్రుడు.


  కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


 అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


  శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.


   ఏక బిల్వం శివార్పణం.




MEEDHUSHTAMA SIVATAMA-18

 


 మీఢుష్టమ శివతమ-18

  ********************


 నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా.

 నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవే కాద-

 నిన్ను విడిచి ఉండలేనయా.


 నేపథ్యములో నుండి వినిపిస్తున్నది,


" శోఏమశ్చమ ఇంద్రశ్చమే-సవితాచమ ఇంద్రశ్చమే"

 అంటు సుస్వరముతో వీరు తరగతి గదిలోనికి ప్రవేశించుచున్నప్పుడు.



 ఆ తరగతి అమ్మాయి " సూషాచమే-సుదినంచమే" అంటు అయ్య ఈ రోజు మాకెంతో సుదినం అంటూ వారికి ఆసనములను చూపించింది.


 ఇంద్ర గారికి ఛేరో పక్కన చంద్ర-సూర్య గారలు కూర్చున్నారు.


 


 అసలు నేనే వాళ్ళు-వాళ్లే నేను అన్నట్లుగా ఉంటుంది మా చిత్రకుటుంబము.అంటూ మిస్టర్ సూర్య వంకకు తిరిగారు.


 "అసౌ యస్తామ్రో అరుణ ఉతబభ్రు సుమంగళ."


  ఉదయము నుండి అస్తమానము వరకు రంగులను మార్చుతు అందరికిని మంగళములను కలిగించువాడు.


  ఎంతటి చతురుడంటే మా చిత్రములోని పాత్రధారులను వారి నిజరూప నామములను మరిపించేస్తాడు.తన మాటలతో-చేతలతో ఎంతో ఉత్తేజ పరుస్తూ,పనిచేస్తున్నా మన్న భావననే తొలగించేస్తాడు.


  మా యజ్ఞం సినిమా కళాకారుల నుండి కొత్త ప్రతిభను అందింపచేస్తాడు.గొప్ప చతురుడులెండి.



 మా సవిత  ఎక్కడ ఉంటే 

                 అక్కడ అంతా ఆహ్లాదకరమైన వాతావరణమే. 

 నునువెచ్చని  గిలిగింతలే.     


  సవిత గారు అంటే, అమ్మాయి అనుమానంగా చూస్తోంది.

 వీడేనండి

, సరదాగా మేము సవిత అంటాము.


 ఎక్కడుంటే అక్కడ ఉత్సాహమే-ప్రోత్సాహమే అని అంటున్న ఇంద్రగారిని,


 మన్నించాలి మధ్యలో మాట్లాడుతున్నందుకు అంటూ,ఇందులో నా గొప్పతనమేమి లేదండి మాకు ముందరగానే,మాకు అర్థమయ్యేలా ఇంద్రగారు మేమేమి చేయాలో వివరిస్తారు.మేమది చేస్తాము.అంతే ఇందులో మా గొప్పతనమేమి లేదు అంటున్నాడు వినయముగా.



 " నమో గిరిశాయచ-శిపివిష్టాయచ."



    శిపులు అనగా కిరణములు.కిరణములయందు ప్రవేశించినవాడు శిపివిష్టుడు.


 చంద్రగారి వంక చూస్తూ మీ అనుభవములను వివరిస్తారా దయచేసి అని అడిగింది.



 ఇంతలో ఇంద్రగారు అబ్బో! వీడు నా నెత్తిమీదెక్కి కూర్చుంటాడమ్మా.

 వీడున్నంతసేపు సెట్ లో ఛలోక్తులు-చమత్కారములు.పైగా చల్లగ ఉండాలి మనమంతా అంటూ, ఎవరు కోపముతో ఉండకూడదని,

    దానిని ఉష్ కాకి అని తోలేస్తాడు.సినిమాలోనే కాంతి మన బ్రతుకులలోను ఉండాలంటు కాంతి విభాగాన్ని తేజోవంతము చేస్తుంటాడు అంటుండగా,


 " నమ సహమానాయచ" అనిపిస్తుంటే,


  పక్క తరగతి అమ్మాయి,ఇంద్రగారి కోసం మిస్టెర్ పృథ్వి గారు ఎదురుచూస్తున్నారంటున్నది.

సమయాభావము- సహకరించండి అంటు కదిలారు వారు.


  తన పక్కన కూర్చున్న రుద్రునిచూస్తూ,


    వీడలేదు నన్ను అని స్థిమితపడ్డాడు సాధకుడు

    వీడిపోడు నన్ను అని స్పూర్తినిస్తున్నాడు రుద్రుడు.



 కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


 అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


 శివానుగ్రహముతో   రేపు కలుసుకుందాము.


 ఏక బిల్వం  శివార్పణం


.




MEEDHUSHTAMA SIVATAMA-17

 మీఢుష్టమ శివతమ-17

*************************
నన్ను వదిలి వెళ్ళిపోకయా-కైలాసవాసా
నన్ను వదిలి వెళ్ళిపోకు కన్నతండ్రి నీవు కాద
నన్ను వదిలి వెళ్ళిపోకయా.
రుద్రా! ఇంట్లోపిల్లలు ఒకటే హడావిడి చేస్తున్నారు.ఇవ్వాళ ఉపాధ్యాయ దినోత్సవమట.
రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ,వారు ప్రస్తుత ఉపాధ్యాయులను శ్రోతలు-ప్రేక్షకులను చేసి,వారు ఉపాధ్యాయులై ప్రవర్తిస్తారట.వింటుంటేనే వింతగా ఉంది.
మనిద్దరము వెళ్ళి చూసి వద్దామా?ఆశగా అడిగాడు రుద్రుని సాధకుడు.
( ఎక్కడ పారిపోతాడో-పక్కనే కూర్చోపెట్టుకుంటే పోలా)
మక్కువగా పిలుస్తున్నాడు.వెళ్ళి పక్కన కూర్చుంటే పోలా అనుకున్నాడు రుద్రుడు.
ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.
" శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షిణాంగే వహంతం
నాగం పాశంచ ఘంటాం డమరుక సహితం చాంకుశం వామభాగే
నానాలంకారదీప్తం స్పటిక మణినిభం పార్వతీశం నమామి."
ఒక విధ్యార్థిని వచ్చి సభకు నమస్కరించి,మొదటగ మనము "యజ్ఞం" సినిమా నిర్మాత-దర్శకుడు ఇంద్రగారితో మాటా-మంతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.( పరిచయము అవసరములేని వ్యక్తి) వెనుక నుండి వినిపిస్తున్నది.)
ఆలస్యములేకుండా తెరను పైకెత్తారు.
ఒక వాక్చమత్కారము, వినయ సంపద కలిగిన విద్యార్థి,పూలగుచ్చమునిచ్చి,సాదర నమస్కారములతో ఆహ్వానించింది వారిని.
" నమో అగ్రియాయచ-ప్రథమాయచ."
మొదటినుండి నున్నవాడు-ప్రముఖుడైన రుద్రునకు నమస్కారములు.
చాలా ఠీవిగా ఆమెకు-సభకు ప్రతి నమస్కారము చేస్తు మరికొంతమందిని తన వెంట తీసుకుని వచ్చి-వారిని తన యజ్ఞ సినిమా భాగస్వామ్యులుగా పరిచయము చేసాడు..
అందరు అక్కడున్న ఆసనములై కూర్చున్నారు
.
పక్కకు తిరిగి చూసుకుంటున్నాడు సాధకుడు రుద్రుని.
" నమః సహమానాయ."
తనకంటె వ్యతిరిక్తముగా భావించు ( తనను ఇంకా నమ్మలేని)సాధకుని సమస్తమును లోబరచుకొను రుద్రునకు నమస్కారము.
చక్కటి రూపము కదా అతనిది అన్నాడు రుద్రుడు సాధకునితో.
నచ్చినట్లుంది.ఎక్కడికి పోడులే స్థిమిత పడ్ద మనసుతో తిలకించసాగాడు.
" నమస్తిష్ఠభ్యో ధావద్భ్యశ్చవో నమః"
నిలుచున్న-పరుగెత్తుచున్న -అనగా పరిపరి విధములుగా పరుగుతీయు మనసును నియంత్రించు రుద్రునకు నమస్కారము.
ప్రశ్న పారంభమైనది అత్యంతాసక్తికరముగా.
అందరు మీకు అగ్రతాంబూలం అంటున్నారు.అదెంతవరకు నిజం? దీనిని మీరు సమర్థిస్తారా? ఖండిస్తారా?
సభ అనుమతితో మీ ప్రశ్నకు సమాధానము చివరికి చెప్పుకుందాము.అని జవాబు వచ్చింది గంభీరముగా.
ఇది మా తొలిప్రయత్నము కనుక సాధారణ ప్రశ్నలతోనే సంభాషణను కొనసాగిద్దాము.
అయ్యా! మీ అసలు పేరు ఇంద్ర యేనా లేక సినీపరిశ్రమకు వచ్చినప్పుడు పెట్టుకున్నదా?
ప్రసన్నముగా ప్రారంభించాడు తన జవాబును జనాలవంక చూస్తూ.
అమ్మా నాన్న పెట్టినపేరు మహేశ్వర-ఈ రంగానికి రమ్మని ప్రోత్సహించి-ఆశీర్వదించిన నాకు అత్యంత గౌరవనీయులైన వ్యక్తి నన్ను మహేంద్ర గా మార్చారు.
నమో ధృష్ణవేచ ప్రమృశాయచ.
పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించేటప్పుడు ఇంద్రుడుగా కీర్తింపబడతారని,
అటువంటి సౌభాగ్యమును నానుండి ఆశిస్తూ ఇంద్ర గా నన్ను పరిచయముచేసారు.,
సమిష్టికృషి సమర్థవంతనీయము అను సూక్తిని నమ్మిన నేను ,నా యజ్ఞం సినిమా భాగస్వాములందరికి సమాన గౌరవములను అందించు పధ్ధతి నన్ను వారిని మీకు పరిచయము చేస్తున్నది,అంటూ వారి వైపు తిరిగాడు.
ఇంతలోనే పక్కతరగతి పిల్లలు వారి తరగతికి ఆహ్వానించటానికి వచ్చారు.
కుడి-ఎడమల సూర్యచంద్రులను కూడి కదిలినాడు ఇంద్రుడు పక్క తరగతిలోనికి.
కన్నులు తిప్పుకోలేక పోతున్నారు ప్రేక్షకులు.
అభద్రతా భావము తొలగినది సాధకునికి.
ఆశీర్వచన భావము కలిగినది రుద్రునికి.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

MEEDHUSHTAMA SIVATAMA-16

 మీఢుష్టమ శివతమ-16.

*******************
నన్ను వదిలి వెళ్ళిపోకయా-కైలాసవాసా
నన్ను వదిలి వెళ్ళిపోకు కన్నతండ్రి నీవు కాద
నన్ను వదిలి వెళ్ళిపోకయా.
రుద్రా! నేను పిలువకున్నా వచ్చేవాడివి.ఇప్పుడు ప్రేమతో రమ్మన్నా రావటములేదు.
మనసంతా చిందర-వందర.
కాసేపు పార్కుదాకా వెళ్ళివస్తాను అంటు అడుగులను కదుపుతున్నాడు.
*******************
మైకులో వినిపిస్తున్నది.ఇది ప్రకృతి నియమము.ఆకలి వేసినపుడు మనము ఆహారము వద్దకు వెళ్ళాలి కాని అది మన దగ్గరకు రాదు.
అలాగే నది తన మార్గములో తాను ప్రవహిస్తూ ఉంటుంది.దాహము వేస్తే మనమే దానిదగ్గరకు వెళ్ళాలి.అది మన దగ్గరకు రాదు కాని మనము వెళితే నీళ్ళను తాగనీయను,-దాహము తీర్చను అనదు..
నమో భవాయచ-రుద్రాయచ.
ప్రాణులందరికి కారణమైన భవునకు నమస్కారము.రోదనమునకు హేతువైన కారణమును
పోగొట్టు రుద్రునకు నమస్కారము.
జ్ఞానము అంతే-జతగా నడుస్తూ అన్నాడు రుద్రుడు.
అంతే-అంతే అన్నాడు. సాధకుడు.
పార్కులోని టి.వి నుండి వయోజనవిద్య ప్రాయోజిత కార్యక్రమము మాత్రము నేరుగా మీ దగ్గరికేవస్తున్నది.
మిత్రులారా! నమస్కారము.
ఇది ఏమిటో కాసేపు కూర్చుని చూద్దాము అన్నాడు రుద్రుడు.
" కాచేది నీవైతే-కాసేపే ఎందుకు? "కళ్ళప్పగించి చూస్తున్నాడు సాధకుడు రుద్రుని.
నమ శ్శ్లోక్యాయచ -అవసాన్యాయచ.
వేదమంత్రములందు-వేదాంతముచే చెప్పబడు రుద్రానీకు నమస్కారములు.
కాయకష్టం చేసివచ్చి కాగితాలు చేతిలో పట్టుకొని కూర్చున్నారు కొందరు యువకులు.
ముందుగా ఇంటిపని పరిశీలన.
వారు కాగితములను తిప్పి చూపించారు.
అందరు అ నుండి అః వరకు అచ్చులను వ్రాసారు.
కాని,పాపం,
కొందరు ఇ తో ప్రారంభించారు.ఇంకొందరు అ తరువాత ఎ వ్రాసారు.మరికొందరు ఈ తరువాత ఇ ,ఇలా అన్ని అక్షరములను వ్రాసినప్పటికిని అమరికలేదు.
అర్థంకాక చూస్తున్నాడు తన తికమకను తలుస్తూ,సాధకుడు
అంతకన్నా అమాయకముగా చూస్తున్నాడు రుద్రుడు..
నమశ్సంభవేచ-మయోభవేచ.
ఇంతలో మాస్టారు వచ్చారు.టేపులను.చార్టులను తీసుకుని.పాట మొదలైనది. చార్టు గోడను అలంకరించినది.
అ-అమ్మ-ఆ- ఆవు, ఇ-ఇల్లు,ఈ-ఈగ...
చూస్తూ వెంటనే సవరించుకుంటున్నారు-చదివేసుకుంటున్నారు సంతోషముగా.
గట్టిగా రుద్రుని చేతిని పట్టుకుంటూ,
నాకు ఇలా తెలియచేసే గురువు కావాలి అన్నాడు.
యన్ తాచమే-యన్ తాచమే అంటు.
అలాగే చూస్తాలే ఎవరినైనా, ,ఏమి తెలియని వాడులా అన్నాడు రుద్రుడు.
ఎవరినైనా ఏమిటి? ఏమనుకుంటున్నావు.?
నాకు కావలిసినది నామమాత్రపు గురువు కాదు.నాకు బోధచేసిన జ్ఞానమును పోషింపగల గురువు.
నీ తమాషాలు నాదగ్గర కాదు.కనుక నువ్వే!నువ్వే నాకు గురువు కావాలి.
.అంతే! ముమ్మాటికి! అన్నాడు సాధకుడు .
నువ్వే నువ్వే నాకు గురువుగా.........
యన్ తాచమే-ధర్తాచమే ఎన్నిసార్లు అంటున్నాడో ఏమో
ప్రసన్న దరహాసము పరమార్థమునందించుటకు తలపంకించినది..
గురుతు పట్టాడు గురువుని సాధకుడు.
మెరుగు పెట్టాలనుకున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.
Lakshmi MV

MEEDHUSHTAMA SIVATAMA-15

 మీఢుష్టమ శివతమ-15

*********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని సేవింపలేడు.
తెల్లారిందా? మీ అల్లరికి,మొదలెట్టేసారు.అర్థాంగి అంతటితో ఆగకుందా...
అదృష్టవంతులు మీ నాన్న.
బారెడు పొద్దెక్కినా..ఏ బాదరబందీ లేకుండ..
ఒక్కసారిగా మెళుకువ వచ్చింది సాధకునికి.
అంటే-
ఇప్పటివరకు నేననుభవించినది,
సత్యమా? లేక స్వప్నమా?
"నమ స్స్వపధ్యో జాగ్రదభ్యశ్చవో నమః".
నిద్రించుచున్న రుద్రునికి నమస్కారము.మేల్కాంచుచున్న రుద్రునికి నమస్కారము వినబడుతోంది రుద్రము సాధకుని సందేహమునకు మరింత సందడి చేస్తూ.
కనికట్టుచేస్తున్నావన్నానని,ఈ రుద్రుడు ఏకంగా,
నా కలలలోనే అలజడిని తెప్పిస్తున్నాడు.అమ్మో! అమ్మో! సామాన్యుడు కాడు.కానే కాడు.
నేను గీసినగీత జవదాటనట్లే ఉంటాడు.తనకు నచ్చిన పనులు నా చేత చేయించుకుంటూనే ఉంటాడు.
అమ్మ సంగతి నాకు చెప్పనేలేదు.ఎంతసేపు తానే అనుగ్రహించువాడిగా అనిపిస్తుంటాడు.
అమ్మ దగ్గర ఎన్ని నాటకాలాడాడు.నన్ను ఎన్ని మాటలన్నాడు.రెండు చేతులను కొంచము కొంచము జరుపుతు ,
ఇంతనా? ఇంతనా? ఇంకొంచమా? అంటు ఎంత కావాలోచెప్పమంటు ఎన్ని తిప్పలు పెట్టాడు.
" నమోవంచతే పరివంచయే స్తాయునాం పతయే నమః" అని కొలుస్తున్నారు కొందరు అక్కడ అసలు విషయమును గ్రహించలేక.
ఊసుపోక నాదగ్గరికి వస్తుంటాడు.ప్రతివిషయములోను నన్ను మోసగిస్తూనే ఉంటాడు అనుకుంటూ అడుగులు కదుపుతున్నాడు సాధకుడు.
పావులను కదుపుతున్నాడు రుద్రుడు.
వాడిని బాగుచేసే పనిలో భాగస్వాములా అన్నట్లు అక్కడ బాల బ్రహ్మచారులు
మతిశ్చమే-సుమతిశ్చమే పఠనమును చేస్తున్నారు.
అంతే కదా.అది నాదగ్గరలేదనేగా ఆ రుద్రునికి అంత అలుసు నేనంటే.
అయినా రుద్రుని అనుకొని ఏమిలాభం? ఏదడిగితే అది ఇస్తానన్నాడుగా.నేనే అడగలేదు.
కాదు-కాదు. అడగాలనిపించ
నీయలేదు ఆ రుద్రుడు.
నేనే కనుక సక్రమముగా ఆలోచించగలిగితే నా మనసును ఎవరు ఆక్రమించగలరు?
నన్ను మోసగించుటకు ఉపక్రమించగలరు?
సాగుతోంది చమకము రాగధారలా
" సంవితశ్చమే-జ్ఞాత్రంచమే " అంటూ.
రానీ రుద్రుని.నన్ను వదిలి వెళ్ళనీయను.ఉడుము పట్టులా పట్టుకుంటాను అనుకుంటున్నాడు సాధకుడు.
రానీ జ్ఞానము ఒడుపుగా పట్టిస్తాను అనుకున్నాడు రుద్రుడు .
సాధకుని చేతిని వదిలివేస్తూ-చేతలను చూపుతూ.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే- అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.

MEEDHUSHTAMA SIVATAMA-14

 మీఢుష్టమ శివతమ-14

**********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునిసేవింపలేడు.
గుడిలో సుష్టుగా ప్రసాదము తిన్నాడు.గుర్రుపెట్టాలనిపిస్తోంది మనసుకు.
తెల్లవారదా,
రుద్రుని నాటకములు తేటతెల్లముకావా,
అనుకుంటూ,ఆవులిస్తూ,శయానేభ్యుడైనాడు సాధకుడు.
ఆసీనేభ్యుడు అంతటితో ఆగనిస్తాడా? సాగకుండా
,
వెండికొండపై అమ్మతో నిండుగా ఆసీనుడైఉన్నాడు.
వారి పాదపద్మముల చెంత ఎందరెందరో దివ్యపురుషులు సేవిస్తున్నారు.
సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమో నమః.
సంభ్రమాశ్చర్యములతో ఉక్కిరి-బిక్కిరి అవుతున్నాడు సాధకుడు.
దేవీ! రోజూ సంభాషించి వస్తుంటానే అతనే ఇతడు.చూసి-వెళదామని వచ్చాడు అంటున్నాడు రుద్రుడు అమ్మతో.
నిలదీద్దామని వస్తే-నిందిద్దామని వస్తే నా ముందరికాళ్ళకు బంధమేసాడు అనుకుంటు,చేసేదిలేక,
అమ్మకు నమస్కరించాడు.
అదికావాలి/ ఇది కావాలి అని అడుగనిస్తుందా ఆ అవ్యాజకరుణ. అంతకు మునుపే ఆప్యాయంగా,
ఏదైనా కావాలా నాయినా? అన్నది
.
మమకారానికి దాసోహమైన వెటకారము పలాయనం చిత్తగించింది.
తరిగిపోని ధాన్యరాశులు కావాలి అమ్మ.
అక్షితిశ్చమే-అక్ష్తుతశ్చమే
అర్థిస్తున్నాడు భక్తితో.
ఎటువంటి ఆహారము కావాలి? నాయినా!
( ఐహిక సంబంధమా/ఆధ్యాత్మిక సంబంధమా/
మనలో మాట.)
మా అందరికి ఆహారం కావాలి అమ్మా.
జైత్రంచమ-ఔద్భిద్యుంచమే.
సుక్షేత్రముగామారిన సాధకుని మనసులో మంచిభావములనే మొలకలు చిగురించి,తీగెలుగా పైకి పాకుచున్నవి.
మా అందరి ఆహారమునకు కావలిసిన ముడిసరుకులు-వడ్లు-యవలు-మినుములు-శనగలు-పెసలు-గోధుమలు-నువ్వులు-నీ వరి ధాన్యములు...
తథాస్తు అన్నది తల్లి తరగని దయతో.
నమ పూర్వజాయచ-పరజాయచ.
దేవీ! నీకీ సాధకుని సంగతి తెలియదు.అనుభవముతో చెబుతున్నాను.
చిరాకు వచ్చినప్పుడలా వచ్చి నీ మీద చిందేస్తాడు.
మగని మాటను గౌరవిస్తూ మారుమాటాడలేదు సర్వమంగళ.మందహాసము చేసింది.
అదే అదనుగా రుద్రుడు చూడు సాధకా!
మా ఇద్దరిది ఒకటే మాట.
ఇంతకావాలా? ఇంకా కావాలా? ఇంకా ఎక్కువ కావాలా? చాలా-చాలా-చాలా....కావాలా?
ఇప్పుడే అనుకుందాము ఒక మాట అన్నాడుచేతుల మధ్యనున్న దూరమును పెంచుతూ.
వివర్ణమయినది సాధకుని మనసు వింత అనుభవముతో.
" విభుచమే-ప్రభుచమే-బహుచమే-పూర్ణంచమే-పూర్ణతరంచమే.....
వేడుకుంటున్నాడు రుద్రుని సాధకుడు.
ఆడుకుంటున్నాడు వానితో రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
చిత్రంలోని అంశాలు: అగ్ని
Lakshmi MV మరియు మోహన్ నాయక్ వాంకుడోత్
1 వ్యాఖ్య
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

MEEDHUSHTAMA SIVATAMA-13

 మీఢుష్టమ శివతమ-13.

**********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడుకానివాడు రుద్రుని దర్శింపలేడు.దయను పొందలేడు.
అమ్మో రుద్రా! నువ్వెంత గడుసరివి.నేరుగానీవు నాతో చెబితే ఎక్కడ కాదంటానేమోనని,నా కన్నుకు కట్టు వేస్తూ,మొత్తానికి నిన్ననాచే మట్టి గొప్పదని గట్టిగానే ఒప్పించావు.
ఆలయములో నుండి అత్యంత మధురముగా,
" నమః ఉర్వర్యాయచ-ఖల్యాయచ" అని వినిపిస్తోంది.
పంటలతో-ధాన్యముతో నిండియున్నా భూమిగా-దానిలోని ధాన్యముగా నుండియున్నావాడు అని.
కాని ఇప్పుడేమో ఒకటే క్షామము.ఎక్కడి ధాన్యరాశులు?ఏమాయిపోయాయి?
అడుగుతున్నారు భాగవతారుని అసహనముగా భక్తులు.
ఏమయినాయంటే పరమాత్మ ఎందుకో,
" వర్షాయచ-అవర్షాయచ" గా తన రూపమును మార్చుకున్నాడు.వర్షపుజలాలను సముద్రజలముగా మార్చివేసాడు.అందుకు.అందులోను ఏదో పరమార్థము దాగిఉంటుంది అంటూ ఏదో చెప్పబోతున్నాడు
.
చిర్రెత్తుకొచ్చింది సాధకుని.నేరుగా ఆలయములోని వెళ్ళాడు.సూటిగా చురకత్తి చూపులతో నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను.రోజుకొక మాట చెబుతారు.దానికి మీరు చెప్పే వివరణ క్షణ-క్షణము పరీక్షలనే మిగులుస్తున్నది.
బిత్తరపోయి చూస్తున్నాడు భాగవతారు.తత్తరపాటుతో ధైర్యమును కూడతీసుకొని ప్రత్యుత్తరమీయబోయాడు.
ఇకచాలు మీ హితోక్తులు.నా సందేహమును తీర్చకుంటే మిమ్మలిని ఇక్కడ నుండి కదలనిచ్చేదేలేదు అంటూ,
అక్కడున్నవారివంక చూస్తూ,
అయ్యలారా!
ఈ పెద్దమనిషి నిన్నగాక మొన్న పరమాత్మ నివాసమును గురించి చెబుతానంటు,
" నమ స్సోభ్యాయచ-ప్రతిసర్యాయచ" అన్నాడు.
పైగా,స ఉభయ అనగా పాపము-పుణ్యము అను రెండు మిళితమై యున్న/పాప-పుణ్యములు సమానముగా వర్తించుచున్న మన,అదే మన మనుష్యలోకమునందుంటాడట.అదే కనుక నిజమైతే,
ఆకలిదప్పులతో అందరిని అలమటించేటట్లు చేస్తాడా? ఆహారమును అందరికి పంచకుండా,తాను మాత్రము నిత్య నైవేద్యములతో ....అంటూ అటుచూడగానే భాగవతారు అక్కడ బ్రహ్మాండముగా
ఆరగింపులను సమర్పిస్తున్నాడు.
వేదికపై వేడుకగా వేవేల వెలుగులతో కూర్చుని
వేదపఠనమును చేస్తున్నాడు రుద్రుడు.
ఒళ్ళు జలదరింపుతో నున్నాడు సాధకుడు.
ముళ్ళు జరిపేయాలనుకున్నాడు రుద్రుడు.
కదిలేవన్నీ కథలు-కదిలించేది కరుణ.
అణువు-అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
చిత్రంలోని అంశాలు: అగ్ని
Lakshmi MV
2 వ్యాఖ్యలు
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...