Monday, November 30, 2020

MEEDHUSHTAMA SIVATAMA-08

 మీఢుష్టమ శివతమ-08

********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని దర్శించలేడు.
సంసారమును అడిగాను.సందేహించకుడా అనుగ్రహించాడు రుద్రుడు.
శక్తిసహాయముతోనే శివుడు అర్థనారీశ్వరమై అందరిని రక్షిస్తాడట.
కాని,నా భార్య నన్నుకాదు,కనీసము నా మాటను కూడా తన మాటతో కలుపుకోవడములేదు.నన్నసలు లెక్కచేయదు.ఎప్పుడు ఏదో సణుగుతూనే ఉంటుంది.
పోనీ పిల్లలను చూసి ఆనందిద్దామంటే వారిగోలవారిది.బుధ్ధులు చెబుదామంటే వినేందుకు వారు సిధ్ధముగా లేరు.పైగా రాధ్ధాంతం చేస్తారు.
కాసేపు అలా చల్లగాలికి వెళితే బాగుంటుంది అనుకుంటు బయలుదేరిన సాధకునికి "సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత"అంటు చెబుతున్న భాగవతారుని చూడగానే చిరాకు చిటారుకొమ్మనెక్కేసింది.
సముద్రతీరాన ఇసుకలో కూర్చుందామనుకుంటే
"సికతాశ్చమే" ఉన్నపాటున తాను పక్కన కూర్చుంటాడు రుద్రుడు.నేను చెప్పకపోయినా నా దిగులుని గ్య్ర్తించి,నీవడిగితేనే ఇచ్చాను కదయ్యా అంటాడు.కాని కష్టపడతావు అని తాను చెప్పలేదని ఒప్పుకోడు.
కనుక అటువెళ్ళవద్దు.ఇటువైపుగా తోటలోనికి వెళ్ళి,కూర్చుంటాను అనుకుంటూ వెళ్ళి,సిమెంటు బెంచీ మీద కూర్చుంటు అటుగా చూసాడు.అవాక్కయ్యాడు.
నమో రోహితాయ స్థపతే వృక్ష్ణాం పతయే నమః
చేతిలో పండును పట్టుకుని,చెట్టుచాటున నిలబడి తననే చూస్తున్నాడు రుద్రుడు.
ఇక్కడా ఉన్నావా? అక్కసుగా అన్నాడు సాధకుడు చేసేది లేక.
నేను నీకీ పండును తినిపిద్దామని ఉన్నానయ్య.అంతేకాదు.
నీకొక వింత విషయము చెబుదామని వచ్చాను.
నేను నిన్ను ఏ వరము అడుగను గాక అడుగను అని మనసులో అనుకుంటు,
ఇప్పుడు నేను నీకేమి చెప్పలేనులే.నువ్వు చెప్పు నేను వింటా అన్నాడు సాధకుడు.
"నమః స్తక్ష్యభ్యో రథకారేభ్యస్చవో నమః."
.
పక్కసందులో నేను నిన్న ఒక వడ్రంగిని చూసానయ్యా.వాక్యమును రుద్రుడు పూర్తిచేయకముందే,అందులో వింతఏముంది? అన్నాడు సాధకుడు అసహనముగా.
కాని అతని చుట్టు చాలా మంది మూగి దుర్భాషలాడుతున్నారు.అతనేమో నా తప్పేది లేదంటున్నాడు.చేతకాకపోతే ఎందుకు ఒప్పుకున్నావు? గద్దిస్తున్నారు.దోషిగా నిలబెడుతున్నారు.
మౌనముగా నిలబడ్డాడు పాపం ఆ వడ్రంగి.మారుమాటాడుట లేదు.
మంచితనముందని నమ్మి నీకు పనిని అప్పగించాం.ఇంత దద్దమ్మవా!చేయలేకపోతే ముందే చెప్పొచ్చుకదా.అక్కరకు రాని నీ పనితనమెందుకు?ఇలా..ఇలా..ఎన్నెన్నో అవమానాలు పాపం వాడికి.
నమశ్శర్వాయచ-పశుపతియేచ.
ఎందుకో నాకు వెళ్ళి వాడిని ఓదార్చాలనిపించింది.మెల్లగా వెన్నుతట్టుతు,కన్నీరు తుడుస్తూ పొరపాట్లు చేయడము సహజము.వాటిని సవరించుకోవదము సంస్కారము అంటున్నానో/లేదో,
వాడు నన్నుచూసి చేతులు జోడిస్తూ నేనెందుకు పనిచేయలేక పోతున్నానో అర్థము కావడములేదు.అన్నాడు అశ్రునయనాలతో.
జమీందారుగారికి పట్టెమంచం చేయాలని ఱంపము పట్టుకుని దగ్గరకు వెళ్ళగానే,అంతలో ఇది టేకుచెక్క.నాణ్యమైనది.విలువైనది అనుకుంటూ దానిని కోయలేకపోతున్నాను.అదేమాదిరి వేపచెక్క,మేడి చెక్క,మామిడి కాండము
,దేవదారు నన్ను వివశుణ్ణిచేస్తున్నాయి అంటు ,తన జాప్యమునకు గల కారణమును చెప్పాదు.
ఎందుకు అవి అలా చేసాయో నాకు అర్థము కాలేదు అన్నాడు రుద్రుడు.సాధకుని మనసులో ఆలోచనలను రేకిత్తుస్తూ.
అరక్షనము ఆలస్యము చేయకుందా సాధకుడు,
ఏ జాతిదైనా చెక్క చెక్కే కదయ్యా.తెలియదా ఈ సంగతి ఆ పిచ్చివాడికి?వాడు దానిని చెక్కగా చూడకుండా,నామరూపముల మోహములో మునిగాడు.అంతే.
మందహాసము చేసాడు మహాదేవుడు.
నేను మాత్రం ఏం చేస్తున్నాను? మథనపడసాగాడు సాధకుడు.
మర్మము తెలిసినదంటు అంతర్ధానమయ్యాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
చిత్రంలోని అంశాలు: అగ్ని
Krishna Anandhamayi
2 వ్యాఖ్యలు
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...